కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 మంది కరోనా బారిన పడ్డారు. 7,948 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఓమిక్రాన్ కేసులు 77 నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ వైపు దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు, మరో వైపు డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వల్ల కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి.
87,245 యాక్టివ్ కేసులు..
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిసి ఇప్పుడు భారత్‌లో 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇండియాలో ఇప్పటి వరకు 3,47,18,602 కేసులు నమోదు అయ్యాయి. అందులో 3,41,54,879 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7,948 మంది కోలుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క రోజులో నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత సంతోషకమరమైన విషయంగానే చెప్పవచ్చు. దేశంలో ప్రతీ రోజు దాదాపు ఇదే సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 4 వేల కేసులు బయటపడ్డాయి. అక్కడ కరోనా వల్ల 282 మంది మృతి చెందారు. తెలంగాణలో 186 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 163 కేసులు నమోదు అయ్యాయి.
undefined
ఓమ్రికాన్ వల్ల ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు - లండన్ సైంటిస్టుల విశ్లేషణ
భారత్ లో 77కి చేరిన ఓమిక్రాన్ కేసులు..
దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీని ప్రభావం అధికంగా ఉండకపోయినా.. ఇది త్వరగా వ్యాప్తిసుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంట్లో ఒక్కరికి సోకినా తొందరగానే కుటుంబ సభ్యులకు ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు భారత దేశ వ్యాప్తంగా 77 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 4 కేసులు నమోదవడంతో అక్కడ ఓమిక్రాన్ కేసులు 10కి చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 4 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కొత్త వేరియంట్ కేసులు 32కి చేరుకుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో రాష్ట్రంలో కొత్తగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 3, ఏపీలో 1, కర్నాటకలో 3, కేరళలో 5, తమిళనాడు 1, మహారాష్ట్ర 32, గుజరాత్ 4, రాజస్థాన్ 17, పశ్చిమ బెంగాల్ 1, ఢిల్లీలో 10 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు తెలిపాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ కొత్త వేరియంట్ సోకే అవకాశం తక్కువగా ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఒక వేళ రెండు డోసులు వేసుకున్న తరువాత కూడా ఓమిక్రాన్ సోకితే.. దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం ఉత్తమమైన మార్గం అని సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకొని, కరోనా నిబంధనలు పాటిస్తే కొత్త వేరియంట్ బారిన పడే అవకాశం ఉండదని చెబుతున్నాయి.