ఓమిక్రాన్ నుంచి మా ఔష‌దం 89 శాతం ర‌క్ష‌ణనిస్తుంది - ఫైజ‌ర్

By team telugu  |  First Published Dec 15, 2021, 12:33 PM IST

ఓమిక్రాన్  వేరియంట్ నుంచి తమ యాంటీ వైరల్ మాత్ర 89 శాతం వరకు రక్షణ ఇస్తుందని ఫైజర్ సంస్థ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. 


క‌రోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ నుంచి తాము త‌యారు చేసిన ఔష‌దం 89 శాతం ర‌క్ష‌ణ ఇస్తుంద‌ని ఫైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది. 2200 మందిపై చేసిన అధ్య‌యనంలో ఈ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయ‌ని చెప్పింది.  మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన నివేదిక‌లో ఈ వివ‌రాలు అన్నీ వెళ్ల‌డించింది. త‌మ యాంటీవైరల్ మాత్ర వేసుకోవ‌డం ద్వారా కోవిడ్ రోగులు  హాస్పిట‌ల్స్‌లో చేర‌కుండా ఉన్నార‌ని తెలిపింది. 90 శాతం ఇది త‌న సామ‌ర్థ్యాన్ని చూపింద‌ని పేర్కొంది. త్వ‌ర‌లోనే దీనికి అమెరికా  ఔష‌ద నియంత్ర‌ణ మండ‌లి ఆమోదం తెలుపుతుంద‌ని ఆశిస్తున్నామ‌ని చెప్పింది. అనుమ‌తులు ల‌భించ‌గానే మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు సన్నాహ‌కాలు జ‌రుపుతున్నామ‌ని తెలిపింది. ఈ యాంటీ  వైర‌ల్ మాత్ర ఇప్పుడు ఓమిక్రాన్ వేరియంట్‌పై కూడా తీవ్రంగా పోరాడుతుంద‌ని పేర్కొంది.

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు.. వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్ రావు
రెండో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ అధ్య‌యనంలోని ప్రాథమిక ఫలితాలను కూడా ఫైజ‌ర్ సంస్థ వెల్ల‌డించింది. 600 మందిపై నిర్వ‌హించిన అధ్య‌యనంలలో ప్ర‌మాద‌క‌ర స్థితిలో ఉన్న రోగుల్లో 70 శాతం మందిని హాస్పిట‌ల్స్‌లో చేర‌కుండా చూసింద‌ని చెప్పింది.  ఇది చాలా శుభ‌పరిణామ‌మ‌ని ఫైజ‌ర్ ఫైజర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైకేల్ డోల్‌స్టన్ తెలిపారు. ఇది ఎంద‌రినో హాస్పిట‌ల్స్ లో చేర‌కుండా చేసింద‌ని తెలిపారు. కోవిడ్ -19 సోకిన రోగుల వ్యాధిని న‌యం చేయ‌డంలో ఇది చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేసింద‌ని చెప్పింది. దీనిని అత్య‌వ‌స‌రంగా ఉప‌యోగించ‌డానికి అమెరికా ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే అనుమ‌తి ఇస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కోవిడ్ -19 చికిత్స కోసం నోటి ద్వారా తీసుకునే యాంటీవైర‌ల్ మాత్ర‌ల‌కు ఇంకా అనుమ‌తులు ల‌భించ‌లేద‌ని చెప్పారు. 

Latest Videos

undefined

తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. 6,78,688కి చేరిన సంఖ్య , హైదరాబాద్‌లో అత్యధికం

ఇప్పుడు ఓమిక్రాన్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో దానిపై ఈ ఔష‌దం ఏవిధంగా ప‌ని చేస్తుందోన‌ని ప‌రిశోధ‌న‌లు చేసిన‌ప్పుడు చాలా మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని డోల్స్ట‌న్ తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ ప్రోటీన్‌పై వ్య‌తిరేకంగా ఈ యాంటీవైర‌ల్ మాత్ర ప‌ని చేసింద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నుంచి అనుమతి వ‌చ్చిన వెంట‌నే దీని ఉత్ప‌త్తిని ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఈ ఏడాది 180,000 మందికి అవ‌స‌ర‌మ‌య్యే మాత్ర‌లు త‌యారు చేసి ఆయా ప్రాంతాల‌కు పంపించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. 2022లో కనీసం 80 మిలియన్‌ల ట్యాబ్లెట్ల‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడున్న ఓమిక్రాన్, భ‌విష్య‌త్‌లో వ‌చ్చే ఇత‌ర వేరియంట్ల కోసం త‌మ సంస్థ ఇత‌ర ప్ర‌దేశాల్లో ఉత్ప‌త్తి ప్రారంభిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్‌లు ఓమిక్రాన్‌ను త‌క్కువ స్థాయిలో నియంత్రిస్తున్నాయ‌ని తెలిపారు. త‌మ యాంటీ వైరల్ మాత్ర మాత్రం కొత్త వేరియంట్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంద‌ని పేర్కొన్నారు. 

click me!