ఢిల్లీలో కొత్త వేరియంట్ కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని, పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం 4 కొత్త కేసులు గుర్తించిన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఓమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని, పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీ ఓమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన మరో నాలుగు కొత్త కేసులను గుర్తించిన నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. మంగళవారం ఓమిక్రాన్ వేరియంట్ 4 కేసులను గుర్తించామని, వారంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు. ఇక్కడ ఉన్న వారికెవరికీ కొత్త వేరియంట్ సోకలేదని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి వరకు ఓమ్రికాన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఓమ్రికాన్ పాజిటివ్ వచ్చిన వారందరినీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే గుర్తించామని అక్కడ నుంచి వారిని డైరెక్ట్‌గా లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జెపి) హాస్పిటల్‌కు తరలించామని చెప్పారు. అందులో ఒకరికి వ్యాధి నయమై డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం ఐదు యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ను ఎదుర్కొవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇక గంటల వ్యవధిలోనే ఓమిక్రాన్ ఫలితాలు..
undefined
అనుమానస్పద కేసులకు ప్రత్యేక చికిత్స..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే వారికి ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో పకడ్బందీగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అక్కడ పాజిటివ్ వచ్చిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అందులో ఓమిక్రాన్‌గా అనుమానం ఉన్న కేసులను గుర్తించి, వారిని వేరుగా ఉంచుతున్నారు. అలా వేరు చేసిన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కొత్త వేరియంట్ ఇతరలకు సోకకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి ప్రత్యేకమైన చికిత్స అందిస్తున్నారు. ఓమిక్రాన్ అనుమానిత కేసులకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ఇటీవల ఐసీఎంఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఇందిరిగాంధీ ఎయిర్‌పోర్టులో 74 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. వారందరికీ లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. ఇందులో 36 మంది డిశ్చార్జ్ అయ్యారు. 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఓమ్రికాన్ వల్ల ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల మరణాలు - లండన్ సైంటిస్టుల విశ్లేషణ
ఢిల్లీలో మొదటి ఓమిక్రాన్ పేషెంట్ డిశ్చార్జ్..
ఢిల్లీలో మొదటి ఓమిక్రాన్ పాజిటివ్ కేసుగా గుర్తించిన వ్యక్తి ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 2వ తేదీన ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో టాంజానియా నుంచి దోహా మీదుగా ఢిల్లీకి వచ్చాడు. ఆ వ్యక్తి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఒక వారం పాటు ఉండి వచ్చాడు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అతడిని పరీక్షించినప్పుడు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అయితే అతడి కొన్ని స్వల్ప లక్షణాలను కనిపించాయి. తరువాత అతడికి ఓమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. అతడిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందించారు. పూర్తిగా కోలుకున్న తరువాత రెండు సార్లు కోవిడ్ -19 పరీక్ష నిర్వహించారు. అందులో నెగిటివ్‌గా తేలడంతో ఈరోజు అతడిని హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించారు.