కరోనా వైరస్ తొలిసారిగా సోకింది ఈ వ్యక్తికే....

By Sree s  |  First Published Mar 29, 2020, 7:43 PM IST

చైనాలోని హుబెయి ప్రావిన్స్ లోని వుహాన్ నగరం లో ఈ వైరస్ పుట్టిళ్లనేది నిర్వివాద అంశం. ఆ నగరంలోని జంతువుల మార్కెట్ లో ఈ వైరస్ ఉద్భవించనేది కూడా అందరూ నిర్ధారించారు. కానీ ఇన్ని రోజులు ఎవరు తొలిసారిగా ఈ కరోనా వైరస్ బారినపడ్డారనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. 


కరోనా పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోతుంది. భారతదేశంపై కూడా ఈ వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండడంతో భారతప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇకపోతే ఈ వైరస్ కి ఇప్పటివరకు మందు లేదు. ఏ దేశంవారు ఆ దేశానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇలాంటి కరోనా వైరస్ ను పూర్తిగా అర్థం చేసుకునేందుకు దాని పూర్తి స్ట్రక్చర్ ని అంచనా వేసేందుకు అసలు ఈ కరోనా త్తోలిసారిగా ఎవరికీ సోకిందో తెలుసుకునే పనిలో పడ్డారు. 

Latest Videos

గత డిసెంబర్ నుండి ఈ మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటికీ...ఇంతవరకు తొలిసారి ఈ కరోనా వైరస్ బారిన పడ్డవారిని మాత్రం గుర్తించకలేకపోయారు. కానీ ఎట్టకేలకు ఈ వైరస్ తొలిసారిగా సోకినా మనిషిని గుర్తించగలిగారు. 

also read:మాంఛెస్టర్‌లో చిక్కుకొన్న వరంగల్ వాసులు: కాపాడాలని కేటీఆర్‌కు వీడియో ట్వీట్

undefined

చైనాలోని హుబెయి ప్రావిన్స్ లోని వుహాన్ నగరం లో ఈ వైరస్ పుట్టిళ్లనేది నిర్వివాద అంశం. ఆ నగరంలోని జంతువుల మార్కెట్ లో ఈ వైరస్ ఉద్భవించనేది కూడా అందరూ నిర్ధారించారు. కానీ ఇన్ని రోజులు ఎవరు తొలిసారిగా ఈ కరోనా వైరస్ బారినపడ్డారనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. 

కానీ ఎట్టకేలకు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తొలిసారిగా కరోనా సోకినా మనిషిని గుర్తించారు. ఆసక్తికర అంశం ఏమిటంటే... ఆ మనిషి ఈ వైరస్ నుండి తేరుకొని జీవించి ఉన్నారు. 

ఆ వ్యక్తి ఒక మహిళ. ఈమె పేషెంట్ జీరో. వుహాన్ మార్కెట్లో రొయ్యలను అమ్మే వ్యక్తి. నెల రోజులపాటు చికిత్స పొందిన తరువాత ఆమె జనవరిలో పూర్తిగా కోలుకుంది. వుయ్ జూషాన్ అనే మహిళా అసలు ఈ వైరస్ ప్రవేశించిన తొలి వ్యక్తి. ఆమెనే మనం పేషెంట్ జీరో గా వ్యవహరిస్తున్నాము. 

ఇకపోతే పేషెంట్ నెంబర్ వన్ ను మార్చ్ మొదటివారంలోనే చైనా అధికారులు గుర్తించగలిగారు. అప్పటినుండి కష్టపడితే... ఇప్పటికి తొలిసారి వైరస్ ప్రవేశించిన వ్యక్తిని కనుగొనగలిగారు. 

ఇకపోతే చైనా ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన సమయానికి విషయం చెప్పకుండా, దాచిపెట్టి ఇలా ఆలస్యంగా వైరస్ మహమ్మారిగా మారినాక విషయాన్నీ బయటపెట్టడం పై ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ఒకవేళ గనుక చైనా అక్టోబర్, నవంబర్ మాసాల్లోనే గనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి తీసుకొచ్చి ఉంటే... ప్రపంచంలోని మిగితా దేశాలకు ఇది పాకేది కాదని, చైనాకు కూడా అన్ని దేశాలు తమవంతు సహాయాన్ని చేసి ఈ వైరస్ ఆటకట్టించి ఉండగలిగేవారం కదా అని అంటున్నాయి. 

click me!