ఒక డ్యూటీ నుంచి వచ్చిన డాక్టర్ తన కొడుకుని దగ్గరకు తీసుకోలేక ఏడుస్తున్న సీన్ మన గుండెలను కూడా పిండేయడం ఖాయం. సౌదీలో తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది.
కరోనా దెబ్బకు ప్రపంచమంతా కుదేలవుతోంది. ఈ వైరస్ మహమ్మారి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యోధులుగా ముందువరసలో నిలబడుతున్నారు డాక్టర్లు.
పగలనకా, రాత్రనకా ఏ దేశమైనా అందరికి కాపలా కాసే సైనికుల్లా డాక్టర్లు ముందుండి ఈ కారొనపై యుద్ధాన్ని నడుపుతున్నారు. ఇక ఇలా యుద్ధం చేస్తున్న డాక్టర్లు తమ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం చాలా కోల్పోతున్నారు.
తాజాగా ఇలా ఒక డ్యూటీ నుంచి వచ్చిన డాక్టర్ తన కొడుకుని దగ్గరకు తీసుకోలేక ఏడుస్తున్న సీన్ మన గుండెలను కూడా పిండేయడం ఖాయం. సౌదీలో తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది.
వివరాల్లోకి వెళితే.... సౌదీలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఒక డాక్టర్ తన హాస్పిటల్ డ్రెస్ లోనే ఇంటికి చేరుకుంటాడు. తండ్రిని చూడగానే సంతోషంతో కొడుకు హత్తుకోవడానికి ఉరుకుతాడు. కానీ ఆ తండ్రి మాత్రం కొడుకుని గద్దించి... తన దగ్గరకు రావద్దు అని అంటాడు.
undefined
అలా కొడుకును దగ్గరకు రావొద్దు అని అన్నందుకు ఆ తండ్రి ఒక్కసారిగా కూర్చుండిపోయి తల పట్టుకు రోదిస్తున్న ఘటన చూస్తే మనకు కూడా కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం.
డ్యూటీ నుండి వచ్చి తన మీద ఏమైనా వైరస్ అవశేషాలుంటే తన కొడుక్కి ఏమైనా అంటుతాయేమో అనే భయంతో కొడుకుని దగ్గరకు తీసుకోలేకపోయానన్న బాధ, అదే సమయంలో తన వంతుగా సమాజానికి సేవ చేస్తున్నానన్న బాధ్యత ఈ రెండిటి మధ్య మనకు అత్యవసర సేవలందిస్తున్నవారంతా ఎంతలా కొట్టుమిట్టాడుతున్నారో కదా!
ఈ వీడియోను ఒకసారి మీరు చూడండి.