కరోనా నుంచి కోలుకున్నా..: కెనడా ప్రధాని భార్య ట్వీట్

By Siva Kodati  |  First Published Mar 29, 2020, 4:38 PM IST

ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా జాతి, లింగ, ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు కోవిడ్ 19 సోకింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సతీమణి గ్రెగొరీ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 


ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా జాతి, లింగ, ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే పలువురు దేశాధినేతలు, ప్రముఖులకు కోవిడ్ 19 సోకింది.

ఈ నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సతీమణి గ్రెగొరీ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తాను కరోనా నుంచి కోలుకున్నానని, డాక్టర్, ఒట్టావా పబ్లిక్ హెల్త్ విభాగం నుంచి సర్టిఫికేట్ కూడా పొందానని సోఫీ గ్రెగోయిర్ ట్రూడో సోషల్ మీడియాలో ప్రకటించారు.

Latest Videos

Also Read:కరోనా వైరస్: కన్న కొడుకుని దగ్గరకు తీసుకోలేక డాక్టర్ కన్నీరు, వీడియో వైరల్!

గ్రెగొరీకి ఈ నెల 12న చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను సెల్ఫ్ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించారు. గ్రెగొరీతో పాటు ప్రధాని ట్రూడో వారి పిల్లలు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

undefined

ప్రధాని స్వయంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. భార్య కోలుకోవడంతో ఆయన వైద్యులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. లండన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు వైరస్ సోకినట్లుగా తేలింది.

Also Read:కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి

మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో కెనడాలో అత్యధిక జనాభా కలిగిన ఒంటారియోలో ఆంక్షల్ని శనివారం నుంచి మరింత కఠినతరం చేశారు. ఇప్పటి వరకు 50 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్న సమావేశాల్ని నిర్వహించుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఆదేశించింది. మరోవైపు కెనడాలో ఇప్పటి వరకు 5,067 మందికి కరోనా సోకగా, 61 మంది మరణించారు. 

click me!