కరోనా వైరస్ దూకుడును తగ్గించడానికి ప్రజల ప్రాణాలను కాపాడటానికి వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ 19ను నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు మరో అమెరికన్ కంపెనీ పరీక్షలకు సిద్ధమైంది.
కరోనా వైరస్ దూకుడును తగ్గించడానికి ప్రజల ప్రాణాలను కాపాడటానికి వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ 19ను నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందించేందుకు మరో అమెరికన్ కంపెనీ పరీక్షలకు సిద్ధమైంది.
40 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఎఫ్‌డీఏ అనుమతి పొందినట్లు ఇనోవియా ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిధులతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నారు.
undefined
Also Read:కరోనాకు స్పెషల్ మాస్క్‌లు: వైరస్‌ను చంపేస్తుందట.. ధర ఎంతంటే...!!
పరిశోధన సజావుగా సాగినప్పటికీ మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం వుందని శాస్త్రవేత్తలు తెలిపారు. డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా ఇనోవియా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో పాటు కాన్సాస్ నగరంలోని సెంటర్ ఫర్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్‌లో వ్యాక్సిన్ పరీక్షలు జరుగుతాయని కంపెనీ వెల్లడించింది.
Also Read:చిన్న టెక్నిక్.. నేను కరోనా నుంచి ఇలా కోలుకున్నా: హ్యారీ పోటర్ రచయిత
ప్రతీ వాలంటీర్‌పై నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల చొప్పుప వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. కాగా 2012లో ప్రపంచాన్ని వణికించిన మెర్స్ వైరస్‌కు ఈ సంస్థే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
గత పదివారాల్లో కరోనా వైరస్ కోసం ఐఎన్ఓ-4800గా పిలిచే వ్యాక్సిన్‌కు సంబంధించి వందలాది డోస్‌లను తయారు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి పది లక్షల డోస్‌లను సిద్ధం చేసి ఎఫ్‌డీఏ అనుమతులు రాగానే పంపిణీ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.