కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్లే వారు ఖచ్చితంగా శానిటైజర్ రాసుకుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్లే వారు ఖచ్చితంగా శానిటైజర్ రాసుకుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు కూడా వైరస్ బారిన పడకుండా రకరకాల మాస్క్‌లు వాడుతున్నారు.
అయితే ఎంతటి ఖరీదు పెట్టి కొన్న నాణ్యమైనా మాస్క్ అయినా సరే దానిపై కరోనా వైరస్ వారం రోజుల పాటు బతికే ఉండే అవకాశం ఉంటుందని లండన్‌కు చెందిన వైద్యులు చెప్పడంతో మానవాళికి కొత్త భయాలు పట్టుకున్నాయి.
undefined
Also Read:చిన్న టెక్నిక్.. నేను కరోనా నుంచి ఇలా కోలుకున్నా: హ్యారీ పోటర్ రచయిత
మరోవైపు మాస్క్‌ల వల్ల జనానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొందరికి శ్వాస ఆడదు, మరికొందరికి దురద పెట్టినట్లుగా ఉంటుంది. అదే సమయంలో మాస్క్ ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించేలా ఉండాలి, వైరస్‌ను ఆకర్షించి చంపేసే రసాయనంతో చేసినదై ఉండాలని పలువురు భావిస్తున్నారు.
అచ్చంగా ఇలాగే ఆలోచించారు ప్రొఫెసర్ సబీనా ష్లిష్. ఆమె చేసిన సూచనల మేరకు అచ్చం ఇలాగే ఉపయోగపడే మాస్క్‌లను ‘‘మాంచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ’’ పరిశోధకులు తయారు చేశారు.
వీటిని మామూలు మాస్క్‌లుగా పిలవకుండా ‘‘స్నూద్’’ అంటున్నారు. అవి మెడ కింది నుంచి ముఖంపైన కళ్ల వరకు ముసుగు ధరించినట్లు ఉండటమే అందుకు కారణం. సాధారణంగా మనుషులు ముక్కు నుంచి శ్వాసను పీల్చుకునే నాళంపై భాగాన ప్రోటీన్ల మిశ్రమం ఉన్నట్లే ఈ స్నూద్‌కు ప్రోటీన్ల మిశ్రమం పూత ఉంటుంది.
Also Read:48గంటల్లో కరోనాని చంపే మందు.. దొరికేసిందా...?
ఇది వైరస్‌లతో పోరాడటానికి మనకు శక్తినిస్తుందని, అలాగే ప్రోటీన్ల పూతకు పై భాగాన వైరస్‌లను నిర్వీర్యం చేసే రసాయనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ స్నూద్‌లను ఏ రోజుకారోజు ఉతుక్కుని మళ్లీ ధరించవచ్చని కూడా పరిశోధకులు చెప్పారు.
అయితే ఈ స్నూద్‌లను ఎన్ని రోజులు ధరించవచ్చో, ఆ ప్రోటీన్ల మిశ్రమం ఎన్ని రోజులు ఉంటుందో శాస్త్రవేత్తలు తెలిపారు. అన్ని చెప్పారు మరీ దీని రేటు ఎంతనేగా మీ డౌట్.. తలపై భాగం నుంచి ధరించే ఈ స్నూద్‌లు ఆన్‌లైన్ మార్కెట్‌లో 20 పౌండ్లు (రూ.1,800) నుంచి అందుబాటులో ఉన్నాయి.