కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి

By narsimha lode  |  First Published Mar 29, 2020, 12:35 PM IST

స్పెయిన్ రాణి మారియా థెరిసా కరోనాతో ఆదివారం నాడు మృతి చెందారు. 



స్పెయిన్:స్పెయిన్ రాణి మారియా థెరిసా కరోనాతో ఆదివారం నాడు మృతి చెందారు.ఆమె వయస్సు 86 ఏళ్లు. స్పెయిన్ రాజు ఫిలిపె -6 కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ  విషయాన్ని పీపుల్స్ మేగజైన్ ప్రకటించింది.

also read:కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

Latest Videos

1933 జూలై 28వ తేదీన ప్రిన్సెస్ మారియా థెరిసా జన్మించారు.ఫ్రాన్స్ లో ఆమె చదువుకొన్నారు.  ఫారిస్ పోర్బోన్నెలో  ప్రొఫెసర్ గా కొంత కాలం పనిచేశారు. అంతేకాదు మాడ్రిడ్ కాంప్లూటెన్సీ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రోఫెసర్ గా కొనసాగారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వ్యక్తం చేసినందుకు ఆమెను రెడ్ ప్రిన్సెస్ గా పిలిచేవారు.

ప్రపంచంలోని అమెరికా, ఇటలీ, చైనా, స్పెయిన్ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇటలీ, స్పెయిన్ దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు. ఈ కారణంగా ఆయా దేశాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా  పాజిటివ్ లక్షణాలు ఉండడంతో ఆయన హోం క్వారంటైన్ కు పరిమితమయ్యాడు. బ్రిటన్ రాణి కెమెల్లాకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఆమెకు నెగిటివ్ గా వచ్చింది. దీంతో ప్రిన్స్ చార్లెస్ దంపతులు స్కాట్లాండ్ లో ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. 

వారం రోజుల క్రితం బ్రిటన్ రాణి ఎలిజబెత్ కూడ హోం క్వారంటైన్ కే పరిమితమయ్యారు.బ్రిటన్ ప్రధాని జాన్సన్ కు కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా రెండు రోజుల క్రితం గుర్తించారు.  
 

click me!