బిగ్ బ్రేకింగ్: మరో 6 నెలలపాటు దేశమంతా లాక్ డౌన్!

By Sree sFirst Published Mar 28, 2020, 9:09 PM IST
Highlights

ఇప్పుడిప్పుడే ఇలా లాక్ డౌన్ చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలను చూస్తున్నామని, ఇలానే గనుక లాక్ డౌన్ ను కొనసాగిస్తే మరిన్ని ఫలితాలను సాధించే ఆస్కారముందని, అందుకోసమే ఈ లాక్ డౌన్ ని మరో 6 నెలల పాటు పొడిగించేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. 

కరోనా దెబ్బకు ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. ఈ మహమ్మారికి మందు లేక ప్రపంచ దేశాలన్నీ తమకు తోచిన విధంగా చికిత్సనందిస్తూ... మందు లేదు గనుక ఈ వైరస్ బారినపడకుండా తమ దేశ ప్రజలను చూసుకోవడమే ఏకైకా మార్గంగా ముందుకు వెళుతున్నాయి. 

ఇలా ఈ వైరస్ బారిన పడకుండా, వైరస్ సోకినవాళ్లను ఎవరితో కలవనీయకుండా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ని ఆపాలని అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా అందుకోసమే లాక్ డౌన్ విధించింది. 

ఇకపోతే బ్రిటన్ లో పరిస్థితి మరి దారుణంగా ఉంది. అక్కడ ప్రిన్స్ చార్లెస్ కి, రాణి ఎలిజబెత్ తో సహా దేశ ప్రధాన మంత్రికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో అక్కడ కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

తాజాగా బ్రిటన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జెన్నీ హర్రీస్ ఈ కరోనా వైరస్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడిప్పుడే ఇలా లాక్ డౌన్ చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలను చూస్తున్నామని, ఇలానే గనుక లాక్ డౌన్ ను కొనసాగిస్తే మరిన్ని ఫలితాలను సాధించే ఆస్కారముందని, అందుకోసమే ఈ లాక్ డౌన్ ని మరో 6 నెలల పాటు పొడిగించేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. 

ప్రస్తుతానికి సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ... గుంపులుగా బయటకు రావడం అన్ని నిషేధించడం వల్ల చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయని ఆమె అన్నారు. ఇలా ఇప్పుడిప్పుడే కరోనాను కట్టడి చేయగలుగుతున్న వేళ ఇలా గనుక లాక్ డౌన్ ను ఎత్తివేస్తే... ఒక్కసారిగా పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆమె అన్నారు. 

ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఈ సమయంలోనే ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే... అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే చైనా, ఇటలీ దేశాలను దాటేసిన సంగతి తెలిసిందే. కాగా... తాజాగా.. అమెరికాలో మొత్తం లక్షకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు గుర్తించారు.

ప్రస్తుతం టాప్‌లో ఉన్న యూఎస్‌లో 1,04,142 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క శుక్రవారం ఏకంగా 17 వేల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇక అమెరికాలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న 300 మంది పైగా మృతి చెందటంతో మొత్తం మృతుల సంఖ్య 1,695 చేరుకుంది.

Also Read కలకలం:బ్రిటన్ ప్రధానికి కరోనా పాజిటివ్ లక్షణాలు...

కాగా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగాన్‌, ఇల్లినాయిస్‌, ఫ్లోరిడాలోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే అక్కడ పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. దీనితో సుమారు 33 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇక డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీరి కోసం 2.2 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులు నిర్మించాలని సైన్యంలోని ఇంజినీర్ల బృందాన్ని ట్రంప్ రంగంలోకి అదింపారు. ఇప్పటికే అన్ని మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేత సౌధం.. ఆఖరి అస్త్ర్రంగా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని కూడా అమల్లోకి తీసుకువస్తోంది.

దీనిని చాలా అరుదుగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి దానిని అమలులోకి తీసుకువచ్చారంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

click me!