దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో రెక్కాడితే కానీ డొక్కాడని వారి కార్మికుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. అలాగే పట్టణాలు, నగరాల్లో ఉన్న వారే అష్టకష్టాలు పడుతున్నారు
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో రెక్కాడితే కానీ డొక్కాడని వారి కార్మికుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. అలాగే పట్టణాలు, నగరాల్లో ఉన్న వారే అష్టకష్టాలు పడుతున్నారు. ఇక మారుమూల గ్రామాలు, పల్లెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇక్కట్లు చెప్పాల్సిన అవసరం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి మరీ, వారి అవసరాలను గుర్తించి, వాటిని తీర్చే వారుంటారా..? అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు.
Also Read:మామయ్య చనిపోతే... మీ నిర్ణయం గొప్పది: ఒమర్ అబ్ధుల్లాపై మోడీ ప్రశంసలు
ఇప్పటికీ విధిపట్ల అంకిత భావం, పేదలకు సేవ చేయాలనుకునే వారు ఉన్నారు. కేరళలోని పథనమ్ తిట్ట జిల్లాలోని అవనిప్పర గిరిజన స్థావరం మీనాచిల్ నదిలోకి అవతలివైపున, పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం లోపల 12 కిలోమీటర్ల లోతులో ఉంది.
undefined
లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రాంతంలోని 37 గిరిజన కుటుంబాలు నిత్యావసరాలు లేక ఇబ్బంది పడుతున్నాయి. వీరి అవస్థలు చూసిన స్థానిక కౌన్సిలర్ సీపీఎం ఎమ్మెల్యే జనీష్ కుమార్‌కు సమాచారం అందించారు.
Also Read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ
ఆయన విషయాన్ని జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యే, స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తమ భుజాలపై నిత్యావసర వస్తువులను మోస్తూ దట్టమైన అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు, గుట్టలు దాటి గిరిజనులకు సరుకులను అందించారు.
అంతేకాకుండా జ్వరం లక్షణాలను చూపించిన పిల్లలకు అవసరమైన వైద్య సదుపాయం అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు.