దేశంలో గత 24 గంటల్లో 92 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్క రోజులో నలుగురు మృతి చెందినట్టుగా కేంద్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ:దేశంలో గత 24 గంటల్లో 92 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఒక్క రోజులో నలుగురు మృతి చెందినట్టుగా కేంద్రం ప్రకటించింది.
దేశంలో 1150 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్ ను ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ దేశంలో అమల్లో ఉంది.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇంటి వద్దే ఉండాలని కేంద్రం ఆదేశించింది. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 262 రిలీఫ్ క్యాంప్ లను ఏర్పాటు చేసింది. లాక్ డౌన్ ద్వారా పని లేకుండా ఉన్న వారి కోసం ఆహారంతో పాటు షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో క్యాంప్ లను ఏర్పాటు చేశారు.
also read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ
మహారాష్ట్రలో సోమవారం నాడు కరోనాతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఈ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకొంది.తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 67 కు చేరుకొంది.
కరోనాతో గుజరాత్ రాష్ట్రంలో సోమవారం నాడు 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. భావ్ నగర్ కు చెందిన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.