కరోనా కల్లోలం: క్వారంటైన్‌లోకి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ

By Siva Kodati  |  First Published Mar 30, 2020, 6:47 PM IST

కరోనా ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతోంది. లింగం, వర్ణం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురు దేశాధినేతలకు కరోనా సోకడంతో వారు ఐసోలేషన్‌లో ఉంటున్నారు. 


కరోనా ధాటికి ప్రపంచం విలవిలలాడిపోతోంది. లింగం, వర్ణం, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలువురు దేశాధినేతలకు కరోనా సోకడంతో వారు ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని భార్య వైరస్ బారినపడ్డారు. జర్మనీ ఆర్ధిక మంత్రి కరోనా సంక్షోభానికి మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రపంచం నివ్వెరపోయింది.

Latest Videos

Also Read:బ్రేకింగ్: కరోనా ఒత్తిడిని తట్టుకోలేక ఆర్ధికమంత్రి ఆత్మహత్య

తాజాగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. గతవారం పార్లమెంట్ సెషన్స్‌కు హాజరైన ప్రధాని.. ప్రతిపక్ష సభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు.

undefined

ఈ క్రమంలో వ్యక్తిగత సహాయకుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో నెతన్యాహూతో పాటు మిగిలిన సిబ్బంది కూడా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు మీడియా కథనాలు ప్రచురించింది.

Also Read:కరోనా వైరస్ తొలిసారిగా సోకింది ఈ వ్యక్తికే....

మరోవైపు ప్రధాని క్వారంటైన్‌కు వెళ్లారనే వార్తలను ప్రధాని కార్యాలయం ఖండించింది. కాగా ఇజ్రాయిల్‌లో ఇప్పటి వరకు 4,347 మందికి కోవిడ్ 19, సోకగా వీరిలో 15 మంది మరణించి, 132 మంది కోలుకున్నారు. 
 

click me!