వియత్నాం అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు తీసుకున్న చర్యల వల్ల ఆ దేశ ప్రజలు సేఫ్ జోన్ లో ఉన్నారు. అభివృద్ధిలో ఈ దేశం వెనకపడే ఉంది. అంతేకాదు.. ఇక్కడ వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా అని చెప్పవచ్చు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, భారత్ లు కూడా కరోనాని ఇప్పటి వరకు కంట్రోల్ చేయలేకపోయాయి. కానీ... అత్యంత చిన్నదేశమైన వియత్నాం మాత్రం.. కరోనా ని జయించింది. ఈ విషయంలో ఈ దేశాలన్నీ వియత్నాం నుంచి నేర్చుకోవాల్సిందే.
చైనా పక్కనే ఉండే వియత్నాంలోకరోనా వైరస్ ని అక్కడి ప్రభుత్వం కట్టడి చేయడం గమనార్హం. ఇతర దేశాల్లో వేలల్లో, లక్షల్లో కేసులు నమోదౌతుంటే.. వియత్నాంలో మాత్రం కేసులు ఇంకా వందల్లోనే ఉండటం విశేషం. మృతుల సంఖ్య జీరోగా ఉండడంతో అందరి చూపు ఆ దేశంపై పడింది.
Also Read డేంజర్ జోన్ లో అమెరికా...లక్ష దాటిన కరోనా కేసులు...
వియత్నాం అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు తీసుకున్న చర్యల వల్ల ఆ దేశ ప్రజలు సేఫ్ జోన్ లో ఉన్నారు. అభివృద్ధిలో ఈ దేశం వెనకపడే ఉంది. అంతేకాదు.. ఇక్కడ వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా అని చెప్పవచ్చు.
దీని రాజధాని హోచిమిన్ సిటీ కాగా..ఈ నగర జనాభ 8 మిలియన్లు. చైనాలో ప్రధాన నగరాల్లో ఒకటైన వుహాన్ లో 2019 చివరిలో కరోనా వైరస్ పుట్టింది. పక్కనే ఉన్న వియత్నాం అప్పుడే అలర్ట్ అయ్యింది. వెంటనే చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
చైనాలో జనవరి 20 నుంచి లాక్ డౌన్ ప్రకటించగా.. వియత్నాంలో జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేశారు. ముందుగా తమ దేశ ప్రజలకు ఎవరికి సోకిందనే దానిపై ఆరా తీశారు. వారిని వెతికి పట్టుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యుల పాత్ర చాలా కీలకంగా మారింది.
ఇది ఒక విధంగా చెప్పాలంటే ఉద్యమంలా సాగింది. మొదట వ్యాధి గ్రస్తులను గుర్తించారు. వారిని ఎటూ వెళ్లకుండా నిర్భందించారు. వీరు ఎవరెవరితో తిరిగారు ? ఎవరితో సన్నిహితంగా ఉన్నారు ? ఇతర విషయాలపై ఆరా తీశారు. వారిని కూడా ఎక్కడకు వెళ్లకుండా ఒక్క దగ్గరనే ఉంచారు. ప్రజల్లో చైతన్యం నింపారు. వారికి ఈ వైరస్ గురించి అర్థమయ్యేలా వివరించారు.అందులో భాగంగా శానిటైజర్లు, మాస్క్ లు విపరీతంగా పంపిణీ చేశారు. పలు జాగ్రత్తలతో అక్కడ ఒక్క కరోనా మరణం జరగకుండా ఆపగలిగారు.