ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం ప్రబలంగానే ఉంది. ప్రస్తుత తరుణంలో ఈ వైరస్ వ్యాపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ తరుణంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఐపీఎల్ పై ఎప్పటి నుండో కూడా బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తుంది.
ప్రపంచాన్ని కరోనా భయం పట్టి పీడిస్తోంది. జనాలు ఆ పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక, మందు లేక భగవంతుడిపైన్నే భారం వేసి సాధ్యమైనన్ని నివారణా చర్యలను తీసుకుంటున్నారు.
ఇక ఈ వైరస్ ఇప్పుడు ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో సంబంధించినదిలా కాకుండా ప్రపంచాన్ని వణికిస్తోంది. పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరిని, అన్ని దేశాలను వణికిస్తోంది. దేశాల మంత్రులు అధ్యక్షుల భార్యలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారంటే... ఈ వైరస్ ప్రభావం ఎంతటిదో మనకు అర్థమవుతుంది.
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు ఈ కరోనా వైరస్ పాకినట్టు సమాచారం అందుతుంది. ధృవీకృత సమాచారం ప్రకారం దాదాపు 190 దేశాల్లో ఈ వైరస్ తన పంజాను విసరడం ఆరంభించింది. అన్ని దేశాలు తమకు సాధ్యమైన రీతిలో కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి.
ఈ కరోనా వైరస్ ధాటికి భారతదేశం ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. తొలుత క్రీడా ఈవెంట్లను ప్రజల్లేకుండా ఖాళీ స్టేడియంలలో నిర్వహించుకోవచ్చని భారత ప్రభుత్వం ప్రకటించినప్పుడు క్రికెట్ మెగా టోర్నీ ఐపీఎల్ ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది.
Also Read:తెలంగాణలో మరో మూడు కాంటాక్ట్ కేసులు: 39కి చేరిన కరోనా సంఖ్య
ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే... భారత దేశంలో 14 ఏప్రిల్ వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. భారతదేశ పరిస్థితి ప్రస్తుతానికి కొంత నాయంగానే ఉన్నప్పటికీ.... మిగిలిన ప్రపంచ దేశాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇటలీ దేశంలో కరోనా విలయతాండవానికి వారు నిస్సహాయులుగా మారిపోయారు.
ఆస్ట్రేలియాలో కూడా కరోనా ప్రభావం ప్రబలంగానే ఉంది. ప్రస్తుత తరుణంలో ఈ వైరస్ వ్యాపించని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ తరుణంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెట్టే ఐపీఎల్ పై ఎప్పటి నుండో కూడా బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తుంది.
అయినప్పటికీ పరిస్థితులు మాత్రం ఇప్పుడప్పుడు కనికరించేలా కనబడడం లేదు. తాజాగా గంగుల్లీ మాట్లాడుతూ... ఐపీఎల్13పై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేనని అన్నాడు.
లీగ్ వాయిదా వేసిన రోజు ఏ పరిస్థితుల్లో అయితే ఉన్నామో.... ఇప్పుడూ ఏవ్ పరిస్థితుల్లో ఉన్నామని అన్నాడు. గత పది రోజుల్లో పరిస్థితులు ఏమీ మారలేదని, ఐపీఎల్ పై మాట్లాడేందుకు తన దగ్గర ఏమీ లేదని అన్నాడు.
Also Read:లాఠీ దెబ్బ సురక్షితం: శానిటైజర్లు పూసి మరీ దంచుతున్న పోలీసులు, వీడియో వైరల్
ఐపీఎల్‌పై వాయిదా స్థితి కొనసాగుతుందని గంగూలీ అన్నారు. భవిష్యత్ టోర్నీల ప్రణాళిక షెడ్యూల్ చేయబడిందని, ఇప్పుడు ఏమీ ప్లాన్ చేయలేమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్‌టీపీని మార్చలేమని, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ సహా అన్ని క్రీడలు నిలిచిపోయావని దాదా అన్నాడు.
దాదా మాటలను బట్టి చూస్తుంటే... ఒక్క విషయం తేటతెల్లం. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏదైతే విండో పీరియడ్ అంటూ వార్తలు వచ్చాయో.... ఆ కాలంలో ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యమని తేలిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ, టి 20 ప్రపంచ కప్ ఈ అన్ని మ్యాచులు ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ ఈ సంవత్సరం జరగడం అసంభవంగానే కనబడుతుంది.