హెవాన్ ప్రావిన్స్‌లోని జియా ప్రాంతంలో ప్రయాణించిన ఓ మహిళలకు కరోనా సోకినట్లు తేలడంతో చైనా ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. సుమారు 6 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించింది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత ఈ వైరస్ చైనాలో మొదలవ్వగా... అక్కడి నుంచి ప్రపంచ దేశాలన్నీ పాకేసింది. అమెరికాలో కరోనా మొదటి స్థానంలో ఉంది. అక్కడ జనాలు వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read కరోనా ఎఫెక్ట్: షాంజైన్‌లో కుక్కలు, పిల్లుల పెంపకంపై బ్యాన్...
అయితే.. చైనాలో మాత్రం కరోనా వ్యాప్తి తగ్గిందని అందరూ భావించారు.కరోనా తగ్గిందని తేలడంతో చైనాలోని చాలా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఎత్తివేశారు. అన్ని ప్రదేశాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో జనజీవితం మళ్లీ సాధారణ దశకు వస్తోంది.
అయితే తాజాగా.. హెవాన్ ప్రావిన్స్‌లోని జియా ప్రాంతంలో ప్రయాణించిన ఓ మహిళలకు కరోనా సోకినట్లు తేలడంతో చైనా ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. సుమారు 6 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ విధించింది.
undefined
కాగా.. కరోనా వైరస్ పీడ వదిలిందని వారు భావించిన తరుణంలో మరో మహిళకు మళ్లీ కరోనా సోకడం అక్కడివారిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. అధికారులు కూడా అప్రమత్తమై... నివారణ చర్యలు చేపడుతున్నారు.
ఇక ఇప్పటివరకూ చైనాలో 81,589 మందికి కరోనా సోకగా.. అందులో 3,305 మంది మరణించారు.