కరోనా ఎఫెక్ట్: షాంజైన్‌లో కుక్కలు, పిల్లుల పెంపకంపై బ్యాన్

By narsimha lodeFirst Published Apr 2, 2020, 2:57 PM IST
Highlights

చైనా దేశంలోని షాంజైన్ పట్టణం పిల్లులు, కుక్కల పెంపకంతో పాటు వాణిజ్యాన్ని నిషేధించిన నగరంగా నిలిచింది. షాంజైన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ రెగ్యులేషన్ చట్టం మేరకు ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.ఈ కొత్త చట్టం ప్రకారంగా పాములు, బల్లుల పెంపకం, అమ్మకం నిషేధించారు.


బీజింగ్: చైనా దేశంలోని షాంజైన్ పట్టణం పిల్లులు, కుక్కల పెంపకంతో పాటు వాణిజ్యాన్ని నిషేధించిన నగరంగా నిలిచింది. షాంజైన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ రెగ్యులేషన్ చట్టం మేరకు ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ ఏడాది మే 1వ తేదీ నుండి ఈ కొత్త చట్టం అమల్లోకి రానుంది.ఈ కొత్త చట్టం ప్రకారంగా పాములు, బల్లుల పెంపకం, అమ్మకం నిషేధించారు.

కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా మనషులు పెంచుకొంటారు. ఇతర జంతువులతో పోలిస్తే మనుషులతో  ఇవి అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటాయి.అభివృద్ది చెందిన దేశాల్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సర్వసాధారణం.

 కుక్కలు, పిల్లుల పెంపకం, అమ్మకాన్ని నిషేధించిన విషయంలో అడ్వర్ టైజ్ మెంట్,  కార్యక్రమాల నిర్వహించడం వంటి కార్యక్రమాలను మార్కెట్ సూపర్‌వైజేషన్  చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆన్ లైన్ వ్యవహరాలల్లో  కూడ కుక్కలు, పిల్లుల పెంపకం విషయంలో బ్యాన్ విధించినట్టుగా అధికారులు స్పష్టం చేశారు.

చైనా దేశంలో వూహన్ పట్టణంలో  ఓ జంతువుల మార్కెట్ నుండి ఈ వైరస్ వ్యాప్తి చెందిందనే ప్రచారం నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఈ కొత్త చట్టంలో పశువులు, పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలు వంటి వాటిని చేర్చలేదు. పందుల నుండి (H1N1), బాతుల నుండి (H5N1),పందుల నుండి స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే.

Also read:అమెరికా యుద్ధనౌకలో కరోనా వైరస్ బాధితులు: ఉన్నతాధికారులకు కెప్టెన్ లేఖ

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు గాను చైనా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి నుండి అడవి జంతువుల విక్రయం, వినియోగంపై శాశ్వత నిషేధాన్ని విధించిన విషయం  తెలిసిందే.అయితే కొన్ని ప్రాంతాల్లో అడవి జంతువుల విక్రయించే మార్కెట్లు తెరుస్తున్నట్టుగా సమాచారం.


 

click me!