తాజాగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర కూడా వేశారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.
కరోనా వైరస్ అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ తొలుత చైనాలో ప్రారంభమైనప్పటికీ... దాని ప్రభావం ఇప్పుడు అమెరికాలో ఎక్కువ చూపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం చైనా, ఇటలీ, స్పెయిన్ లను దాటేసి... అమెరికా తొలి స్థానంలో నిలవడం గమనార్హం.
ప్రస్తుతం అమెరికాలో 81,896 మంది కరోనా సోకడం గమనార్హం. చైనాలో 81,285 కేసులు ఉండగా.. ఇటలీలో 80,589 మంది కరోనా బాధితులు ఉన్నారు. యూఎస్ లో కొత్తగా 13,685 కేసులు నమోదయ్యాయి. దానిని బట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా... ఇప్పటి వరకు అగ్ర రాజ్యంలో 1,174 మంది ప్రాణాలు కోల్పోయారు.
undefined
Also Read కరోనా వైరస్: ఒకసారి కోలుకున్న వ్యక్తికి మళ్ళీ వస్తుందా...?.
తాజాగా కరోనా వైరస్ తీవ్రత అధికంగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలు భారీ విపత్తుగా ప్రకటించాయి. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదముద్ర కూడా వేశారు. అమెరికా ఆర్థిక రాజధాని అయిన న్యూయార్క్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.
ఇతరదేశాలతో పోల్చితే కరోనా టెస్ట్ ల విషయంలో అమెరికా చాలా వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ లు చేయవలసిన అవసరం లేదని ఇప్పటివకే అగ్రరాజ్యపు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా టెస్ట్ ల విషయంలో ఆయన ఆలోచన చాలా ఢిఫరెంట్ గా ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా వేలమంది అమెరికన్లు చనిపోయే ప్రమాదముంది.
దేశవ్యాప్త షట్ డౌన్ కు పిలుపునివ్వబోతున్నారా అని రెండు రోజుల క్రితం ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం... దేశవ్యాప్త షట్ డౌన్ చేసే ప్రశక్తే లేదు. షట్ డౌన్ చేస్తే కరోనా మరణాలు కన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంకా ఎక్కువమంది మరణిస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు.