రాజప్రాసాదంలో ఏడుగురు ఉద్యోగులకు కరోనా: క్వారంటైన్‌లోకి మలేషియా రాజు, రాణి

By Siva Kodati  |  First Published Mar 26, 2020, 3:47 PM IST

ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు.. పేద వారి నుంచి అపర కుబేరుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఛార్లెస్‌లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు క్వారంటైన్‌లో ఉంటున్నారు


ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు.. పేద వారి నుంచి అపర కుబేరుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఛార్లెస్‌లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారు క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఇదే సమయంలో మలేషియా రాజప్రాసాదంలో పనిచేసే ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ దేశపు రాజు, మహారాణి సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఏడుగురు ఉద్యోగులకు కౌలాలంపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Latest Videos

undefined

Also Read:డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు: ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్

ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సదరు ఏడుగురు ఉద్యోగులకు కరోనా ఎలా సోకిందనే దానిపై మలేషియా ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.

రాజు, రాణి ఇద్దరికి రాజప్రాసాదంలో పరీక్ష నిర్వహించగా.. ఇద్దరికీ కరోనా నెగిటివ్ అని తేలినట్లు రాయల్ హౌస్ హోల్డ్ కంప్ట్రోలర్ అహ్మద్ ఫాదిల్ షంసుద్దీన్ తెలిపారు. అయినప్పటికీ వారిద్దరూ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన వెల్లడించారు.

Also Read:క్వీన్ ఎలిజిబెత్ కి కరోనా.. ప్యాలెస్ వదిలేసి..

అలాగే వైరస్ సోకిన సిబ్బందితో సన్నిహితంగా మెలిగిన వారికి కరోనా పరీక్షలు చేయాల్సిందిగా ప్యాలెస్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశానికి సంబంధించిన వివరాలు అందించేందుకు గాను రాజును కలవొద్దని ప్రధాని మొహిద్దీన్ యాస్సిన్‌‌కు ప్యాలెస్ అధికారులు సూచించారు.

కోవిడ్ 19 కారణంగా మలేషియాలో ఇప్పటి వరకు 21 మంది మరణించారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. 

click me!