గంటలోనే కరోనా నిర్ధారణ: టెస్టింగ్ కిట్ తయారు చేసిన యూకే

By narsimha lodeFirst Published Mar 26, 2020, 3:19 PM IST
Highlights

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ లక్షణాలను అతి త్వరగా నిర్ధారించే టెస్టింగ్ కిట్ ను బ్రిటన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రస్తుతం కరోనా వ్యాధి నిర్ధారించేందుకు కనీసం ఒక్క రోజు లేదా రెండు రోజుల సమయం పడుతోంది.


న్యూఢిల్లీ:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ లక్షణాలను అతి త్వరగా నిర్ధారించే టెస్టింగ్ కిట్ ను బ్రిటన్ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రస్తుతం కరోనా వ్యాధి నిర్ధారించేందుకు కనీసం ఒక్క రోజు లేదా రెండు రోజుల సమయం పడుతోంది. అయితే బ్రిటన్ పరిశోధకులు తయారు చేసిన కిట్ ద్వారా కనీసం గంట వ్యవధిలో కరోనా వైరస్ ను నిర్ధారించే అవకాశం ఉంటుంది.

కరోనా వైరస్ లక్షణాలు కనీసం 14 రోజుల తర్వాత బయటపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారించేందుకు స్మార్ట్‌ఫోన్ తో పనిచేసే  పోర్టబుల్ కిట్ ను యూకే శాస్త్రవేత్తలు రూపొందించారు.  

గొంతు నుండి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా కరోనా వ్యాధి వచ్చిందా లేదా అనే విషయాలను నిర్ధారించనున్నారు. కేవలం 50 నిమిషాల్లోనే కరోనా లక్షణాలను ఉన్నాయో లేవో తేల్చే అవకాశం ఉందని యూకే శాస్త్రవేత్తలు తేల్చారు..

కరోనా ఒక్కటే కాకుండా సుమారు 16 నమూనాలను కూడ ఈ కిట్ ద్వారా పరీక్షించే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. ల్యాబ్ ల్లో మాత్రం 384 నమూనాలను పరీక్షించే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ తమకు సోకిందో లేదో తెలుసుకొనేందుకు ఈ కిట్ పనికొస్తోందని కూడ పరిశోధకులు చెప్పారు.

Also read:ప్రిన్స్ ఛార్లెస్ కు కరోనా పాజటివ్

కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి చికిత్స చేసిన వైద్యులు తమకు కరోనా వైరస్ సోకిందో లేదో తెలుసుకొనేందుకు ఈ కిట్ ద్వారా చాలా సులభమమని ఈ కిట్ తయారు చేసిన బృందం తేల్చి చెప్పింది.గొంతు నుండి సేకరించిన నమూనాల నుండి మూడు నిమిషాల్లోనే ఆర్ఎన్ఏను వెలికితీసి కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తారు. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పలు దేశాల్లో ఈ వ్యాదితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వ్యాధితో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం ఆందోళన కల్గిస్తోంది.
 

click me!