తీవ్రంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ... కొందరు మాత్రం రోడ్లమీదలకు వస్తున్నారు. వీరివల్ల అనవసరంగా కరోనా పెరుగుతుందని, అది సమాజానికి, దేశానికి అంత మంచిది కాదు అని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇక ఎవరైనా అనవసరంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తే కాల్చి పడేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
కరోనా దెబ్బకు ప్రపంచమంతా బెంబేలెత్తిపోతోంది. ఈ మహమ్మారికి మందు లేక ప్రపంచ దేశాలన్నీ తమకు తోచిన విధంగా చికిత్సనందిస్తూ... మందు లేదు గనుక ఈ వైరస్ బారినపడకుండా తమ దేశ ప్రజలను చూసుకోవడమే ఏకైకా మార్గంగా ముందుకు వెళుతున్నాయి.
ఇలా ఈ వైరస్ బారిన పడకుండా, వైరస్ సోకినవాళ్లను ఎవరితో కలవనీయకుండా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ని ఆపాలని అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా అందుకోసమే లాక్ డౌన్ విధించింది.
ఇంత తీవ్రంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ... కొందరు మాత్రం రోడ్లమీదలకు వస్తున్నారు. వీరివల్ల అనవసరంగా కరోనా పెరుగుతుందని, అది సమాజానికి, దేశానికి అంత మంచిది కాదు అని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇక ఎవరైనా అనవసరంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి బయటకు వస్తే కాల్చి పడేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
ఇలా నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావడం, ప్రభుత్వ అధికారులతో సహకరించకపోవడం, వైద్య అధికారులను దూషించడం అన్నీ కూడా క్షమించరాని నేరాలని ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే అభిప్రాయపడ్డారు.
undefined
అందుకోసమే ఇలా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కాల్చి పారేయండి అంటూ పోలీసులకు ఆదేశాలను జారీ చేసారు. అందరూ గృహ నిర్బంధంలో ఉండాలని, ఎవ్వరికి కూడా ఎటువంటి కష్టం రానివ్వమని, ఎవ్వరు ఆకులు తో ఉండాల్సియినా అవసరం లేదని, అందుకోసం నాలుగు బిలియన్ డాలర్ల ఆర్థికసహాయం ప్రకటించినట్టు ఆయన తెలిపారు.
ఇకపోతే... భారతదేశంలో నిజాముద్దీన్ ప్రార్థనల నేపథ్యంలో అక్కడి నుండి దేశంలోని నలుమూలలా ఈ వైరస్ వ్యాపించింది. తాజాగా కేంద్రం దేశంలోని 10 ప్రాంతాలను రెహాట్ స్పాట్లుగా ప్రకటించింది.
దేశంలో ఉన్న అత్యధిక కేసులు ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ హాట్ స్పాట్లలోనే ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా దేశంలో 24 గంటల్లోనే 386 కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు పెరగడానికి కారణం ఢిల్లీలో మతప్రార్థనలకు హాజరయినవారు అని తేలడంతో అన్ని రాష్ట్రాలు వారికోసం తీవ్రంగా వెదకడం ఆరంభించింది.
ఇప్పటివరకు ఈ మత ప్రార్థనలకు హాజరయిన 6000 మందిని గుర్తించారు. వారిలో ఇప్పటికే 5000 మందిని క్వారంటైన్ కి తరలించారు. తెలంగాణ, గుజరాత్,తమిళనాడు సహా వేరే రాష్ట్రాల్లో మిగిలిన 1000 మందితోపాటుగా వారితో సన్నిహితంగా మెలిగారు అనుకుంటున్నా మరో 100 మంది కోసం జల్లాడ పడుతున్నారు.
ఇకపోతే దేశం మొత్తంలో 9000 మంది వరకు నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాలుపంచుకున్నారని, వీరిలో 1300 మంది విదేశీయులు ఉన్నారని కేంద్ర హోమ్ శాఖ తెలిపింది. అత్యధికమంది విదేశీయులు ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. 247 మందిని అక్కడ క్వారంటైన్ లో ఉంచారు.
ఈ తబ్లీఘి జమాత్ సంస్థ ప్రార్థనలకు హాజరయిన వారిని వెదకడానికి దాదాపుగా 24 రాష్ట్రాలతోపాటు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ సంస్థకు చెందినవారిని టెస్ట్ చేయగా దాదాపు 400 మంది కరోనా పాజిటివ్ లుగా తేలారు.
ఏపీలో 71, తెలంగాణలో 28, అస్సాంలో 13,తమిళనాడు 190, ఢిల్లీ 53, మహారాష్ట్రలో 12 కేసులు ఈ సంస్థకు చెందినవారుగా తేలారు.
ఇకపోతే తెలంగాణలో నిజాముద్దీన్ బాంబు వల్ల రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. తెలంగాణలో తాజాగా బుధవారంనాడు కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు.
దాంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆ విషయాన్ని వెల్లడించారు.
గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోదా ఆస్పత్రిలో ఒకరు బుధవారం మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినవారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, మరణించిన ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినవారేని చెప్పారు సోమవారం మరణించిన ఆరుగురిలో ఐదుగురు మర్కజ్ వెళ్లి వచ్చినవారు. తొలుత విదేశాల నుంచి వచ్చినవారిలో కొంత మందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. దీంతో మర్కజ్ వెళ్లి వచ్చినవారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
బుధవారం దాదాపు 500 మంది సమాచారం సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు, వారితో సంబంధాలు పెట్టుకున్నవారిలో చాలా మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆస్పత్రిలో 80 మందిని, హైదరాబాదులోని అమీర్ పేటలో గల ప్రకృతి వైద్యశాలలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆస్పత్రిలో 110 మందిని చేర్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది జాడ తెలియాల్సి ఉంది. వారి నుంచి దాదాపు రెండు వేల మందికి కరోనా వ్యాపించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.