అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ దేశంలో రెండువేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 కారణంగా ఓ పసికందు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి చికాగోకు చెందిన నెలల పసికందు ప్రాణాలను కాపాడేందుకు తాము అన్ని ప్రయత్నాలను చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జకర్ తెలిపారు. చిన్నారి మరణం తమను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి
ప్రజాప్రతినిధులగా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. మహమ్మారి కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
undefined
ఈ చిన్నారి మరణంతో ఇప్పటి వరకు వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారే ప్రాణాలు కోల్పోతారన్న అంచనా తప్పింది. కాగా కరోనా కారణంగా ఇల్లినాయిస్‌లో మరణించిన వారిలో 85 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు.
Also Read:బిగ్ బ్రేకింగ్: మరో 6 నెలలపాటు దేశమంతా లాక్ డౌన్!
ఇక అమెరికా వ్యాప్తంగా లక్షా 20 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 2 వేల మరణాలు సంభవించాయి. మరణాల పరంగా ఇటలీ, స్పెయిన్, చైనా తర్వాతి స్థానంలో అమెరికా నిలిచింది.