కరోనా మరణ మృదంగం: రానున్న రోజుల్లో మరో 10 లక్షల కేసులు... డబ్ల్యూహెచ్‌ఓ

By Sree sFirst Published Apr 2, 2020, 9:19 AM IST
Highlights

రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10లక్షల కరోనా కేసులు బయటపడతాయని, కరోనా మరణాల సంఖ్య 50వేలకు చేరుకుంటుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పుడీ వైరస్ ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు. అన్ని దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడప్పుడు తగ్గుముఖం పట్టే ఆస్కారం ఎక్కడా కనబడడం లేదు. 

ఇక తాజాగా ఇదే విషయాన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డీజీ కూడా ధృవీకరించారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10లక్షల కరోనా కేసులు బయటపడతాయని, కరోనా మరణాల సంఖ్య 50వేలకు చేరుకుంటుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. 

Also Read కరోనా సోకినా వదలని టిక్ టాక్ పిచ్చి... వీడియో వైరల్...

గడచిన ఐదు వారాలుగా కరోనా కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని, మరణాల సంఖ్య కూడా రెట్టింపు అయిందని, ఇవి ముంచుకొస్తున్న ప్రమాదానికి హెచ్చరికలని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇకపోతే తెలంగాణలో నిజాముద్దీన్ బాంబు వల్ల రోజు రోజుకూ పరిస్థితి దారుణంగా మారుతోంది. తెలంగాణలో తాజాగా బుధవారంనాడు కరోనా వైరస్ సోకి ముగ్గురు మరణించారు. 

దాంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆ విషయాన్ని వెల్లడించారు.

గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోదా ఆస్పత్రిలో ఒకరు బుధవారం మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లి వచ్చినవారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. 

బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, మరణించిన ముగ్గురు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినవారేని చెప్పారు సోమవారం మరణించిన ఆరుగురిలో ఐదుగురు మర్కజ్ వెళ్లి వచ్చినవారు. తొలుత విదేశాల నుంచి వచ్చినవారిలో కొంత మందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. దీంతో మర్కజ్ వెళ్లి వచ్చినవారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 

బుధవారం దాదాపు 500 మంది సమాచారం సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు, వారితో సంబంధాలు పెట్టుకున్నవారిలో చాలా మందిని ఆస్పత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆస్పత్రిలో 80 మందిని, హైదరాబాదులోని అమీర్ పేటలో గల ప్రకృతి వైద్యశాలలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆస్పత్రిలో 110 మందిని చేర్చారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది జాడ తెలియాల్సి ఉంది. వారి నుంచి దాదాపు రెండు వేల మందికి కరోనా వ్యాపించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

click me!