మాంఛెస్టర్‌లో చిక్కుకొన్న వరంగల్ వాసులు: కాపాడాలని కేటీఆర్‌కు వీడియో ట్వీట్

By narsimha lode  |  First Published Mar 29, 2020, 2:39 PM IST

వరంగల్ జిల్లాకు చెందిన కొందరు బ్రిటన్ లో చిక్కుకుపోయారు. తమను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ మేరకు వారంతా ఓ వీడియోను పోస్టు చేశారు.


వరంగల్: వరంగల్ జిల్లాకు చెందిన కొందరు బ్రిటన్ లో చిక్కుకుపోయారు. తమను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఈ మేరకు వారంతా ఓ వీడియోను పోస్టు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ఇండియా ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో బ్రిటన్ నుండి తాము ఇండియాకు వచ్చేందుకు వీలు లేకుండా పోయిందని బ్రిటన్ లో చిక్కుకొన్న వరంగల్ వాసులు చెప్పారు. 

Latest Videos

తాము ఈ నెల 20వ తేదీనే ఇండియాకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొన్నామని గుర్తు చేశారు. అయితే అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతోనే విమానాశ్రయ అధికారులు తమను నిలిపివేశారని వారు చెప్పారు.

also read:కరోనా దెబ్బ:స్పెయిన్ రాణి మారియా థెరిసా మృతి

లాక్ డౌన్ కారణంగా తమ ఉద్యోగాలు కూడ లేకుండా పోయాయని కొందరు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బ్రిటన్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

తమను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. హోం క్వారంటైన్ లో తాము ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమను రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

click me!