కరోనా లాక్ డౌన్: చుక్క పడక పిచ్చెక్కిపోతున్న మందుబాబులు

By Sree s  |  First Published Mar 28, 2020, 6:39 PM IST

ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకోని ఎవ్వరూ కూడా మందు కొని నిల్వ చేసుకోలేదు. కానీ ఆ జనతా కర్ఫ్యూను అమాంతం పెంచుతూ కేసీఆర్ మార్చ్ నెలాఖరు అన్నారు. ఇక ఆ తరువాత మోడీ గారు అందుకొని ఏప్రిల్ 14 అన్నారు. ఇదంతా బాగానే ఉంది. నిత్యావసరాలు అందుబాటులో ఉన్నప్పటికీ...   మందుబాబులు తమకు కావలిసిన మందు దొరక్క విలవిలలాడిపోతున్నారు. 


ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు... ఈ కరోనా లాక్ డౌన్ మందుబాబుల ప్రాణం మీదకు వచ్చింది. మందు దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. బ్లాకులో మందు ఎంతైనా సరే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మందు మాత్రం దొరకడం లేదు. 

ఏదో ఒక్కరోజు జనతా కర్ఫ్యూ అనుకోని ఎవ్వరూ కూడా మందు కొని నిల్వ చేసుకోలేదు. కానీ ఆ జనతా కర్ఫ్యూను అమాంతం పెంచుతూ కేసీఆర్ మార్చ్ నెలాఖరు అన్నారు. ఇక ఆ తరువాత మోడీ గారు అందుకొని ఏప్రిల్ 14 అన్నారు. ఇదంతా బాగానే ఉంది. నిత్యావసరాలు అందుబాటులో ఉన్నప్పటికీ...   మందుబాబులు తమకు కావలిసిన మందు దొరక్క విలవిలలాడిపోతున్నారు. 

Latest Videos

ఊళ్లలో అయితే నాటుసారా గుడుంబా, కల్లు ఏదైనా సరే కిక్కే లక్ష్యం అన్నట్టుగా తాగేస్తున్నారు. హైద్రాబాద్ లో మందు దొరక్క ఒక మందుబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఏకంగా మందుబాబులు మందు షాపులకు కన్నాలు వేయడానికి కూడా వెనకాడడం లేదు. 

Also Read వియత్నాంను చూసి నేర్చుకోవాలి.. చిన్నదేశమైనా..కరోనాని జయించింది...

ఇటువంటి సంఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి కూడా. ఇక ఊర్లలోనయితే ఉదయం నుండే కల్లు కోసం క్యూలు కడుతున్నారు. ఈత కల్లు తాటి కల్లు అని తేడా లేకుండా ఏదైనా సరే నషా ఎక్కితే చాలన్నట్టుగా మీదపడి తాగేస్తున్నారు. సాధారణంగా 20 రూపాయలుండే సీసా ఇప్పుడు 50 రూపాయలకు చేరుకుంటుంది. 

ఇకపోతే తెలంగాణలో మద్యం షాపులను రేపటి నుండి మద్యాహ్నం పాటు ఒక రెండున్నర గంటల పాటు తెరిచి ఉంచుతామని చెప్పే ఒక ఫేక్ సర్కులర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఈ ఫేక్ న్యూస్ ను కూడా మందు బాబులు తెగ షేర్ చేస్తున్నారు. అందులో గ్రామర్ ను బట్టి చూస్తే ఇదేదో ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. కానీ మందుబాబుల మద్యం లవ్ వారిని కనీసం ఆ పోస్టును పూర్తిగా కూడా చదవనివ్వడంలేదు. చదువొచ్చినవారు, చదువు రానివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మందు లవర్ దాన్ని ఫార్వర్డ్ చేసాడు. 

సోషల్ మీడియా గ్రూపుల్లో నెలరోజులపాటు మందు కొనుక్కొని పెట్టుకోవాలని తెగ చర్చలు కూడా పెడుతున్నారు. ఇలా మందుబాబులకు ఒక్కసారిగా ఇది ఫేక్ న్యూస్ అని తెలియగానే తెగ బాధపడిపోతున్నారు. 

ఇకపోతే ఊళ్లలో కల్తీ మందు కూడా ఏరులై పారుతుంది. నాటుసారా, గుడుంబా అనే తేడా లేకుండా దానికోసం జనం ఎగబడుతున్నారు. ఫారిన్ మందులు మాత్రమే తాగే మందుబాబులు కూడా ఇప్పుడు చీప్ లిక్కర్ దొరికినా చాలు అని అనుకుంటున్నారు. 

click me!