హైద్రాబాద్ సీసీఎంబీలో కరోనా పరీక్షల నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది.
హైదరాబాద్: హైద్రాబాద్ సీసీఎంబీలో కరోనా పరీక్షల నిర్వహించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి సీసీఎంబీలో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీసీఎంబీలో ఒకేసారి కనీసం వెయ్యి మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
undefined
ఈ నెల 31వ తేదీ నుండి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రైవేట్ ల్యాబ్ ల్లో కరోనా పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ల్యాబ్ ల్లో పరీక్షలకు అనుమతి లభించింది.
also read:తెలంగాణలో కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం: 10 కేసులు నమోదు
అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ల్యాబ్ ల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పరీక్షలు చేయలేని పరిస్థితులు ఉంటే అప్పుడు ప్రైవేట్ ల్యాబ్ ల్లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
గతంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన వారిలో 11 మందికి నెగిటివ్ వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29వ తేదీన ప్రకటించింది.