దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన యువకుడి టోకరా: దాచేసిన బంధువులు

By telugu team  |  First Published Mar 30, 2020, 4:43 PM IST

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ యువకుడు ఎక్కడ కూడా సమాచారం ఇవ్వకుండా షాద్ నగర్ లో ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో అధికారులు అతని పాస్ పోర్టును రద్దు చేసే దిశలో ఆలోచన చేస్తున్నారు.


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, సంబంధిత అధికారులు ఎంతగా చెప్పినా కొందరు బేఖాతరుగా వ్యవహరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా క్వారంటైన్ కు వెళ్లాలనే నిబంధనను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి యువకుడి ఉదంతం ఒక్కటి రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ లో వెలుగు చూసింది.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ యువకుడు శ్రీనివాస్ షాద్ నగర్ లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతను దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడనే విషయాన్ని బంధువులు దాచిపెట్టారు. దాంతో అతను షాద్ నగర్ ప్రాంతంలో తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అతని పాస్ పోర్టును రద్దు చేసే దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. 

Latest Videos

తెలంగాణలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాధితో ఓ వృద్ధుడు మృత్యువాత కూడా పడ్డాడు. కరోనా వైరస్ కు మందులు లేవని, స్వీయ నియంత్రణ ద్వారానే దాన్ని ఎదుర్కోగలమని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అయినా శ్రీనివాస్ అనే యువకుడు అలా ప్రవర్తించడం ఆగ్రహానికి గురవుతోంది. 

విదేశాల నుంచి వచ్చినవారు తప్పకుండా ఎక్కడో ఓ దగ్గర సమాచారం ఇవ్వాలని, 14 రోజుల పాటు స్వీయ నియంత్రణలో ఉండాలని చెబుతున్నారు. అయినా శ్రీనివాస్ దాన్ని పట్టించుకోవడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది.

click me!