తెలంగాణలో కరోనాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం: 10 కేసులు నమోదు

By narsimha lodeFirst Published Mar 30, 2020, 3:06 PM IST
Highlights

కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు కేసులు నమోదు చేశారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన మరునాడే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.

హైదరాబాద్: కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై హైద్రాబాద్ పోలీసులు సోమవారం నాడు కేసులు నమోదు చేశారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన మరునాడే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల  చర్యలు తీసుకొంటుంది.  అయితే కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహయం కోరినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోకి ఆర్మీ అడుగుపెట్టిందని అసత్య ప్రచారం చేశారు.

మరో వైపు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించిందని కూడ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడ రెడ్ జోన్ గా ప్రకటించలేదు.ఇక మద్యం దుకాణాలను తెరుస్తారని కూడ ప్రచారం చేశారు. 

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తామో చూడాలని కేసీఆర్ ఆదివారం నాడు మీడియా సమావేశంలో చెప్పారు. అసత్య ప్రచారాలు చేసిన వారికి కరోనా వస్తోందని శాపనార్థాలు పెట్టారు.

Also read:తెలంగాణలో కరోనా: 11 మందికి కరోనా నెగిటివ్ ప్రకటించిన కేటీఆర్

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

దీంతో సోషల్ మీడియాలో అసత్యప్రచారానికి సంబంధించి సీసీఎస్ పోలీసులు 10 కేసులు నమోదు చేశారు. ఎవరు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఈ ప్రచారం సాగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.


 

click me!