30 రోజులకే కరెంట్ రీడింగ్,మొబైల్‌కు బిల్లులు: టీఎస్‌ఎస్ పీడీసీఎల్

By narsimha lodeFirst Published Apr 8, 2020, 4:43 PM IST
Highlights

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లు రీడింగ్ తీయని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీఎస్‌ఎస్ పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకొంది. గత ఏడాది మార్చి మాసంలో ఎంత బిల్లును చెల్లిస్తే ఈ ఏడాది మార్చి మాసంలో కూడ అంతే బిల్లును చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది

హైదరాబాద్:కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కరెంటు బిల్లు రీడింగ్ తీయని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టీఎస్‌ఎస్ పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకొంది. గత ఏడాది మార్చి మాసంలో ఎంత బిల్లును చెల్లిస్తే ఈ ఏడాది మార్చి మాసంలో కూడ అంతే బిల్లును చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు వినియోగదారులకు తమ మొబైల్ ఫోన్లకు గత ఏడాది మార్చి మాసంలో కరెంట్ బిల్లుల సమాచారాన్ని పంపనున్నారు.

లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఇంటికి వెళ్లి మీటరు రీడింగ్ తీసే అవకాశం లేదు. దీంతో గత ఏడాది మార్చి నెల రీడింగ్ ను పరిగణనలోకి తీసుకోవాలని టీఎస్‌ఎస్ పీడీసీఎల్ నిర్ణయం తీసుకొంది.

విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు విద్యుత్ సిబ్బంది కూడ విధులు నిర్వహించే పరిస్థితులు లేవు. ఆన్‌లైన్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించాలని విద్యుత్ సంస్థ ప్రకటించింది.వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు 2019 మార్చి మాసంలో పే చేసిన బిల్లులో సగం మాత్రమే చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ కారణంగా మీటరు రీడింగ్ తీసే పరిస్థితి లేని కారణంగా తెలంగాణ విద్యుత్ సంస్థకు  తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి మండలి మంగళవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

లాక్ డౌన్ ముగియగానే విద్యుత్ ఉద్యోగులు ప్రతి ఇంటికి తిరిగి మీటర్ రీడింగ్ లు తీస్తారు. ఈ బిల్లు ఆధారంగా ఆన్ లైన్ లో చెల్లించిన సొమ్మును విద్యుత్ సంస్థ మే మాసంలో సర్ధుబాటు చేయనుంది. ఎక్కువ బిల్లు చెల్లిస్తే, మే మాసంలో తక్కువ చెల్లించాలి, తక్కువ చెల్లిస్తే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

also read:'కరోనా' కారు తయారు చేసిన హైద్రాబాద్ వాసి సుధాకర్

30 రోజులు దాటిపోతున్న నేపథ్యంలో శ్లాబ్ లు జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని 30 రోజులకే మీటరు రీడింగ్ తీసేలా ఆన్ లైన్ సర్వర్ లో మార్పులు చేర్పులు చేయనున్నారు.
 

click me!