కరీంనగర్ కు కరోనా మోసుకొచ్చిన ఇండోనేషియన్లపై మరో కేసు

By telugu team  |  First Published Apr 8, 2020, 2:54 PM IST

తెలంగాణలోని కరీంనగర్ కు కరోనా వైరస్ ను మోసుకుని వచ్చిన ఇండోనేషియన్లపై మరో కేసు నమోదైంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ద్వారా కరీంనగర్ వచ్చిన ఇండోనేషియన్ల ద్వారా కరీంనగర్ లో కరోనా వైరస్ విస్తరించిన విషయం తెలిసిందే.


కరీంనగర్: కరీంనగర్‌లో కరోనా వ్యాప్తికి కారణమైన ఇండోనేషియన్లపై రామగుండం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. క్రైం నెంబర్ 32/2020, ఐపీసీ 420, 269, 270, 188, సెక్షన్ 3 ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ -1897, సెక్షన్ 51 (b) డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, సెక్షన్. 14(1)(b), 7, 13, 14(c), ఫారినర్స్ యాక్ట్ -1946 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. 

మార్చి 14 ఇండోనేషియన్లు ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో ద్వారా రామగుండం రైల్వే స్టేషన్‌లో దిగి ముసలియా మజీద్‌లో ప్రార్థనలు చేశారు. అనంతరం ఓ వాహనం‌లో కరీంనగర్ కు వెళ్లారు. కరోనా వైరస్ బారిన పడ్డ విషయం ముందే తెలిసి కూడా రామగుండం ప్రాంతం ప్రజలకు వ్యాపింప జేయాలనే దురుద్దేశంతోనే వారు వచ్చారని రామగుండం సీఐ తాండ్ర కర్ణాకర్ రావు తెలిపారు. 

Latest Videos

ఇండోనేషియన్లు కరీంనగర్‌కు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం, టూరిస్ట్ వీసా మీద వచ్చి పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా మసీదును సందర్శించడాన్ని నేరంగా పరిగణిoచామని కరుణాకర్ రావు వివరించారు. వారికి ఆశ్రయం కల్పించిన మసీదు ఇమామ్ పై కూడా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

ఇదిలావుంటే, కరోనా వైరస్‌ను మోసుకొచ్చిన ఇండేనేషియన్లపై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. క్రైం నెంబర్ 108/2020.. ఐపీసీ సెక్షన్ 420, 269, 270, 188ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎపడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 సోక్షన్ 3, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు 2005 సెక్షన్ 51 బి, ఫారినర్స్ యాక్ట్ 1947 సెక్షన్ 14 (1) (బి), 7,13, 14(సి) ల ప్రకారం వన్ టౌన్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది.

కరీంనగర్ లో పర్యటించిన 10 మంది ఇండోనేషియా దేశస్థులు, వారికి గైడ్లుగా వ్యవరించిన ఇద్దరు, స్థానికంగా ఆశ్రయం కల్పించిన వారిపై కూడా వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో కేసులు నమోదు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొని వారు సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో రామగుండం వచ్చారు. రామగుండం నుంచి ఆటోలో కరీంనగర్ వచ్చారు. 

click me!