'కరోనా' కారు తయారు చేసిన హైద్రాబాద్ వాసి సుధాకర్

By narsimha lode  |  First Published Apr 8, 2020, 3:53 PM IST

:కరోనా వైరస్ పోలిన కారును తయారు చేశాడు హైద్రాబాద్ వాసి సుధాకర్. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కారును తయారు చేసినట్టుగా ఆయన చెప్పారు.
 


హైదరాబాద్:కరోనా వైరస్ పోలిన కారును తయారు చేశాడు హైద్రాబాద్ వాసి సుధాకర్. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కారును తయారు చేసినట్టుగా ఆయన చెప్పారు.

హైద్రాబాద్ కు చెందిన సుధాకర్ వినూత్నంగా కార్లను తయారు చేయడంలో పేరు పొందాడు. అనేక వెరైటీ కార్లను తయారు చేసి.. వాటితో మ్యూజియాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేశాడు సుధాకర్.

Latest Videos

కరోనా వైరస్ రూపంలో ఉన్న కారును సుధాకర్ ఆవిష్కరించాడు. కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కారును తయారు చేసినట్టుగా చెప్పారు. అంతేకాదు ఇంటి వద్దే ఉండడం ద్వారా కరోనాను వ్యాప్తి చెందకుండా నిలిపివేసే అవకాశం ఉందన్నారు సుధాకర్.

సింగిల్ సీటర్ తో ఈ కారును తయారు చేశారు. ఈ కారుకు ఆరు చక్రాలుంటాయి. పైబర్ తో కారు బాడీని తయారు చేశారు. ఈ కారు తయారు చేయడానికి 10 రోజులు పట్టిందని సుధాకర్ చెప్పారు. గంటకు 40 కి.మీ వేగంతో ఈ కారు ప్రయాణిస్తోందని ఆయన తెలిపారు.ఈ కారును ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను హైద్రాబాద్ పోలీసులకు గిఫ్ట్ గా ఇవ్వనున్నట్టుగా సుధాకర్ తెలిపారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ట్రైసైకిల్ ను తయారు చేసినందుకు గాను సుధాకర్ గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించాడు. ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో కార్లను తయారు చేయడంలో సుధాకర్ ముందుంటాడు.

Also read:కాంగ్రెస్‌ అనుకూల వైద్యులే విమర్శలు చేస్తున్నారు: తలసాని

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు రకాల కార్లను సుధాకర్ తయారు చేశాడు. స్మోకింగ్ కు వ్యతిరేకంగా సిగరెట్ కారు, ఎయిడ్స్ పై అవగాహన కోసం కండోమ్ బైక్, రోడ్డు ప్రమాదాలపై చైతన్యం కల్పించేందుకు గాను  హెల్మెట్ కారును తయారు చేశాడు.

జంక్ ఆటోమొబైల్ విడి బాగాలతో ఈ కార్లను సుధాకర్ తయారు చేస్తాడు. ఈ కార్లను సాధారణ వేగంతో నడపొచ్చు. హైద్రాబాద్ నెహ్రు జులాజికల్ పార్క్ సమీపంలోని తన మ్యూజియంలో ఈ కార్లను సుధాకర్ ఉంచాడు.బర్గర్, బ్యాగ్, కెమెరా, పుట్ బాల్, కంప్యూటర్ ఆకారంలో కూడ కార్లను తయారు చేశాడు సుధాకర్. 

click me!