తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కేసులు కొత్త కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. స్వీయ నియంత్రణే మందు అని చెప్పారు.
హైదరాబాద్: ఈ ఒక్క రోజే రాష్ట్రంలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. మరో 25 వేల మంది క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు మార్చి 31వ తేదీ వరకు ప్రకటించిన విషయం తెలిసిందే
కరోనాకు ప్రపంచంలోనే మందు లేదని, సోషల్ డిస్టాన్స్ పాటించడమే మార్గమని ఆయన చెప్పారు. ఐసోలేషన్ వార్డులో 11 వేల మందిని పెట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు 60 వేల మంది వ్యాధికి గురైన చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
undefined
Also Read: కరోనా భయం: పట్టించుకోని బంధువులు.. అందరూ ఉన్నా చెత్తబండిలో అనాథ శవంలా.
కరోనా వల్ల వల్ల అమెరికానే ఆగమైందని ఆయన అన్నారు. స్పెయిన్, ఇటలీల్లో మాదిరిగా మనదేశంలో వస్తే 20 కోట్ల మందిపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని ఆయన అన్నారు. తాము ధైర్యం కోల్పోలేదని, అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నామని ఆయన చెప్పారు.
వంద మంది అవసరమైతే 130 మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని అన్నారు. తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆయన అన్నారు. తాము వంద శాతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read: దేశం లాక్ డౌన్... ఇంటికి వెళ్లడానికి రెండు రోజుల్లో 115కిలోమీటర్లు.
ప్రధాని నరేంద్ర మోడీతో ఈ ఉదయం మాట్లాడానని, అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. మనం చర్యలు తీసుకోకపోతే విస్ఫోటనంలా ఉండేదని ఆయన చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల కింద పంటలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆనయ చెప్పారు.ప్రజల అలసత్వం సరి కాదని, బాధలు భరించాలని ఆయన అన్నారు.
హైదరాబాదులోని హాస్టల్స్ మూసేయబోమని, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని, ప్రజల చలనాన్ని కట్టడి చేయడమే ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండాలని ఆయన అన్నారు.