లాక్‌డౌన్ కష్టాలు: అన్నా.. ఇంట్లో పెళ్లాంతో చస్తున్నానంటూ ట్వీట్, కేటీఆర్ రిప్లై అదుర్స్

By Siva Kodati  |  First Published Mar 27, 2020, 9:07 PM IST

కొందరికి మాత్రం ఏం తోచడం లేదు. దీంతో లాక్‌డౌన్‌ను ఎలా గడపాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా లాక్‌డౌన్ వల్ల ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా అంటూ ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.


కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజులు అంతంగా పట్టించుకోని జనాలు.. ఆ తర్వాత పోలీసులు, నేతలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారం దృష్ట్యా ఇంటికే పరిమితమవుతున్నారు.

పిల్లలు, కుటుంబసభ్యులతో గడుపుతూ, లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొందరికి మాత్రం ఏం తోచడం లేదు. దీంతో లాక్‌డౌన్‌ను ఎలా గడపాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా లాక్‌డౌన్ వల్ల ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా అంటూ ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశాడు.

Latest Videos

Also Read:చికెన్, గుడ్లు తింటే కరోనా వైరస్ ను ఎదుర్కోవచ్చు: కేసీఆర్

‘‘ కేటీఆర్ అన్నా.. ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా.. నా రిక్వెస్ట్ ఏంటంటే, టీవీ ఛానెల్ వారిని కొంచెం మంచి సినిమాలు వేయమని చెప్పండి. లేకపోతే నాకు ఒకే దారి ఉంది. కాబట్టి ప్లీజ్ అంటూ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చారు. బహుశా మీ ఆవిడ ట్విట్టర్‌లో లేదనుకుంటున్నా.. ( నీ మంచి కోసం) అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు సైతం దీనిపై విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

Also Read:తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కరోనా కేసులు, ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్: కేసీఆర్

మరోవైపు ఈ ఒక్క రోజే తెలంగాణలో 10 కరోనా కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59కి చేరుకుంది. మరో 25 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. పరిస్ధితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 

I just hope (for your well-being) that your wife is not on Twitter 😅 https://t.co/eezswQzlBK

— KTR (@KTRTRS)
click me!