తెలంగాణ సరిహద్దుల్లో ఇరాన్ జాతీయుల సంచారం, అడ్డుకున్న పోలీసులు

By Siva Kodati  |  First Published Mar 27, 2020, 8:21 PM IST

జోగులాంబా గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్‌ప్లాజా దగ్గర ఇరాన్ దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు


కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారతదేశాన్ని 21 రోజుల పాటు లాక్‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలన్నీ సరిహద్దులు మూసేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నాయి. ఈ క్రమంలో జోగులాంబా గద్వాల్ జిల్లా పుల్లూర్ టోల్‌ప్లాజా దగ్గర ఇరాన్ దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Aslo Read:చికెన్, గుడ్లు తింటే కరోనా వైరస్ ను ఎదుర్కోవచ్చు: కేసీఆర్

Latest Videos

ఎటువంటి అనుమతి లేకుండా ఎలా రాష్ట్రంలోకి వస్తారని వారిని పోలీసులు ప్రశ్నించారు. కర్నూలు మీదుగా ఈ నలుగురు వ్యక్తులు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాము కోల్‌కతా, చెన్నై నుంచి వస్తున్నామని  భారత్‌లో తిరిగేందుకు తమకు పర్మిషన్ వుందని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

లోపలికి అనుమతిస్తే తమ దేశానికి తిరిగి వెళ్లిపోతామని వారు అన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. పై అధికారుల నుంచి అనుమతి వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండాలని పోలీసులు ఇరాన్ జాతీయులకు నచ్చజెప్పారు.

Also Read:తెలంగాణలో ఈ ఒక్క రోజే పది కరోనా కేసులు, ఏప్రిల్ 15 దాకా లాక్ డౌన్: కేసీఆర్

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులతో పాటు ఇతర ఉద్యోగస్తులు వారిని చూసి ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో వీరు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదని, తక్షణం వీరిని ఇక్కడి నుంచి మరో చోటికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. 

click me!