మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఔదార్యం: అనాథ తల్లికి అంత్యక్రియలు

By telugu teamFirst Published Mar 27, 2020, 7:45 AM IST
Highlights

మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తా వద్ద దిక్కులేక మరణించిన మహిళ అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస గౌడ్ సహకరించారు. ఆమెకు మతిస్థిమితం లేని కుమారుడు తప్ప ఎవరూ లేరు.

మహబూబ్ నగర్: తెలంగాణ చౌరస్తా వద్ద యాచకురాలు యాదమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు చొరవ తీసుకొని, మున్సిపాలిటీ, రెడ్ క్రాస్ వారితో అనుసంధానమై వాహనాన్ని ఏర్పాటు చేయించారు. స్వయంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్లి స్టేచ్చర్ పై వాహనంలోకి ఎక్కించి, అంత్యక్రియలకు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. కష్టకాలంలో కన్న కొడుకులా దాతృత్వం చాటుకుంటున్న మంత్రి మానవత్వం పరిమళించిన మంచి మనసున్న మకుటం లేని మారాజు అని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మరోసారి నిరూపించుకున్నారు. 

వివరాల్లోకి వెళితే...మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యాచకురాలు గా జీవనం కొనసాగిస్తున్నా యాదమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందింది. అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో కరోణ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాలలో కూరగాయల మార్కెట్ల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

తెలంగాణ చౌరస్తా లో ఒక అనాధ వృద్ధులు మృతి చెందింది అన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలికి మానసిక వికలాంగులైన ఒక కుమారుడు కూడా ఉన్నాడని వారిద్దరు కలిసి భిక్షాటనతో జీవనం గడుపుతారని రాత్రి కాగానే తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో నిద్రిస్తారని మున్సిపల్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

మంత్రి వెంటనే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై మున్సిపల్ అధికారులతో ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. స్వయంగా మంత్రి ఆ అనాథ మృతురాలి శవాన్ని అంబులెన్స్ లోకి ఎక్కించి అంత్యక్రియలకు పంపారు. అసలే కరోనా వ్యాప్తి తో తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ కాకూడదనే ఆందోళనల లోంచి కాబోలు రాత్రింబవళ్ళు పని చేస్తున్న మంత్రిని ఈ సంఘటన కొంత కలిచివేసింది. 

తన నియోజకవర్గ ప్రజలలో ఒక్కరికి కూడా ఎలాంటి అపశృతి జరగకూడదని మంత్రి పడుతున్న తపనను చూసిన పాలమూరు పట్టణ ప్రజానీకం ఏప్రిల్ 14 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని వదిలి బయటికి కోరుకున్న మంత్రికి సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

click me!