కరోనా కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై స్టే ను కొనసాగిస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. ఈ విషయమై ఏప్రిల్ 15వ తేదీ న విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్: కరోనా కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై స్టే ను కొనసాగిస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. ఈ విషయమై ఏప్రిల్ 15వ తేదీ న విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 20వ తేదీన ఆదేశించింది. ఈ నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
పదో తరగతి పరీక్షలపై సోమవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేసింది. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి వచ్చింది.
ఏప్రిల్ 15వ తేదీన ఉన్న పరిస్థితిని బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకొంటామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. ప్రకటించింది. పరీక్షల నిర్వహణపై ఉన్న స్టేను కొనసాగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసును ఏప్రిల్ 15వ తేదీన విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
ఇదిలా ఉంటే మంగళవారం నుండి జరగాల్సిన అన్ని పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం రీ షెడ్యూల్ చేసింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్టుగా ప్రకటించింది. అయితే కొత్త తేదీల నిర్ణయంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సోమవారం నాడు ప్రకటించారు.