258 మంది క్వారంటైన్ నుండి విడుదల: తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

By narsimha lodeFirst Published Apr 7, 2020, 5:51 PM IST
Highlights

విదేశాల నుండి హైద్రాబాద్ కు వచ్చిన  258 మందిని ఇంటికి పంపాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంగళవారం నాడు ఆదేశించింది.


హైదరాబాద్: విదేశాల నుండి హైద్రాబాద్ కు వచ్చిన  258 మందిని ఇంటికి పంపాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంగళవారం నాడు ఆదేశించింది.

గత మాసంలో విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల క్వారంటైన్ లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది., శంషాబాద్ విమానాశ్రయం నుండి  రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్శిటీతో పాటు దానికి సమీపంలో ఉన్న రెండు భవనాల్లో  వీరిని క్వారంటైన్ చేశారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఈ నెల 30 వరకు కోర్టుల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయం

విదేశాల నుండి వచ్చిన 258 మందిని 14 రోజులుగా క్వారంటైన్ లో ఉంచారు. అయితే వీరికి పరీక్షలు నిర్వహించారు. వీరికి కరోనా వైరస్ సోకలేదని అధికారులు ప్రకటించారు. వైరస్ సోకని వారిని వెంటనే క్వారంటైన్ నుండి ఇంటికి పంపాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఈ మేరకు ఆయా జిల్లాల వైద్యఆరోగ్యశాఖాధికారులకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేశారు.

క్వారంటైన్ లో ఉన్న వారిలో ఎక్కువగా రంగారెడ్డి జిల్లాకు చెందినవారు ఉన్నారని సమాచారం. ఇవాళ సాయంత్రం క్వారంటైన్ నుండి వారి ఇళ్లకు అధికారులు పంపనున్నారు. మరో వైపు క్వారంటైన్ నుండి విముక్తి లభించిన వారంతా కూడ ఇంటి వద్దే ఉండాలని సూచించారు. ఇంటి నుండి బయట తిరగకూడదని కూడ ప్రభుత్వం సూచించింది.

click me!