డ్యూటీతో పాటు ఆపదలో సాయం: పేదలకు నిత్యావసరాలు అందించిన పోలీసులు

By Siva Kodati  |  First Published Apr 7, 2020, 5:14 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇల్లు విడిచి బయటకు వచ్చే పరిస్ధితి లేకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ కూలీల పరిస్ధితి దారుణంగా తయారైంది. 


కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌనన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇల్లు విడిచి బయటకు వచ్చే పరిస్ధితి లేకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ కూలీల పరిస్ధితి దారుణంగా తయారైంది.

 

Latest Videos

undefined

 

ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా జైపూర్‌ మండలం నర్వ గ్రామంలోని కష్ట జీవులకు పోలీసులు ఆపన్న హస్తం అందించారు. సుమారు 55 పేద కుటుంబాలను గుర్తించిన జైపూర్ ఎస్సై విజయేందర్, రామగుండం పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ సూచన మేరకు విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు.

 

 

దీనిపై స్పందించిన సర్పంచ్ రాజ్‌కుమార్... 55 కుటుంబాలకు మంగళవారం జైపూర్ ఏసీపీ, శ్రీరాంపూర్ సీఐ చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు పంపిణీ  చేశారు. విధి నిర్వహణతో పాటు కష్టకాలంలో తమకు అండగా నిలిచిన పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు 

click me!