కరోనాకి కులమతాలు రుద్దొద్దు... ప్రభుత్వానికి కాంగ్రెస్ సహకరిస్తుంది: ఉత్తమ్

By Siva Kodati  |  First Published Apr 5, 2020, 6:58 PM IST

కరోనాకి మతం రంగు పులమొద్దని అన్నారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం గాంధీ భవన్‌లో ఫేస్‌బుక్ లైవ్‌లో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కరోనా సహాయక చర్యల్లో కార్యకర్తలు సైనికుల్లా ముమ్మరంగా పాల్గొనాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.


కరోనాకి మతం రంగు పులమొద్దని అన్నారు టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం గాంధీ భవన్‌లో ఫేస్‌బుక్ లైవ్‌లో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కరోనా సహాయక చర్యల్లో కార్యకర్తలు సైనికుల్లా ముమ్మరంగా పాల్గొనాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

కరోనాను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందన్నారు. ఎవరికీ వారు స్వీయ రక్షణ కల్పించుకుంటూ అన్ని వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

Latest Videos

undefined

Also Read:దేశంలో కరోనా కేసులు ఎందుకు పెరిగాయో తెలియదా: ఒవైసీపై రాజాసింగ్ ఫైర్

కులమతాలకు అతీతంగా కరోనా కట్టడికి పోరాటం చేయాలని ఆయన సూచించారు. జిల్లాలు, పట్టణాల వారీగా 250 మంది పార్టీ నేతలతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహాయ సహాకారాలు అందించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత కొద్దిరోజుల నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉందని.. ఇంత వరకు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందలేదని ఉత్తమ్ ఆరోపించారు.

Also Read:ఓవైసీ మూర్ఖుడు: మోడీపై విమర్శలకు బండి సంజయ్ ఘాటు రిప్లై

రాష్ట్రంలో 87 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం 22 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పరిస్థితులను వివరిస్తానని చెప్పారు. 

click me!