కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు క్వారంటైన్లు, ఐసోలేషన్లు అంటూ ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని ఎంతగా ఎంతమంది చెప్పినా కొందరు బాధ్యత లేకుండా తిరుగుతున్నారు.

Also Read:దేశంలో కరోనా కేసులు ఎందుకు పెరిగాయో తెలియదా: ఒవైసీపై రాజాసింగ్ ఫైర్
undefined
మరికొందరు వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వస్తున్నప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని కట్టడి చేయడానికి వినూత్నంగా కరీంనగర్‌లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
మాస్కులు పెట్టుకోని వారిని యమ ధర్మరాజు పట్టుకుపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్యక్రమాన్ని చేపట్టారు టీఆర్ఎస్ నేత , తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి జీఎస్ ఆనంద్. యమ ధర్మరాజు వేషంతో ఉన్న కళాకారుడిని వెంటబెట్టుకుని ప్రజలకు, మార్కెట్లో ఉన్న వారికి ఆయన వివరించారు.
Also Read:మంచి మనసు చాటుకున్న కేటీఆర్... నాలుగేళ్ల క్యాన్సర్ చిన్నారికి వైద్యసాయం
సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, తదితర అంశాలపై ఆనంద్ తెలిపారు. దీంతో అప్పటి వరకు మాస్కులు లేని వారు మాస్కులు పెట్టుకుని కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులు విక్రయించారు. ఈ విషయం మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పలువురు టీఆర్ఎస్ నేతలు అన్నారు.