కరోనా ఎఫెక్ట్: ఈ నెల 30 వరకు కోర్టుల్లో లాక్‌డౌన్ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయం

By narsimha lode  |  First Published Apr 7, 2020, 2:34 PM IST

 కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వ తేది వరకు కోర్టుల్లో లాక్ డౌన్ ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వ తేది వరకు కోర్టుల్లో లాక్ డౌన్ ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వీడియా కాన్పరెన్స్ ద్వారానే పుల్ కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 25న మరోసారి పుల్ కోర్టు సమావేశమై లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నిర్ణయం తీసుకొంది.

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. సోమవారం నాడు రాత్రికి 364 కేసులు నమోదయ్యాయి. వీరిలో 11 కేసులు నమోదయ్యాయి.  కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా  కొన్ని కేసులు విచారణ చేస్తున్నారు. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా పాజిటివ్ కేసులను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నెల 14వ తేదీ వరకు  లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

Also read:ఢిల్లీ నుండి నేరుగా హైద్రాబాద్‌కు: ఆరుగురు మలేషియన్ల అరెస్ట్

కరోనా వ్యాప్తిని నిరోధించడానికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని సోమవారం నాడు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ ను మరికొంత కాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మర్కజ్ నుండి వచ్చిన వారి కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 

click me!