కరోనా లాక్ డౌన్... కూతురి అంత్యక్రియలు వీడియో కాల్ లో..

By telugu news team  |  First Published Apr 4, 2020, 9:56 AM IST

బిడ్డ ప్రాణాలు కాపాడాలని అప్పు చేసి మరీ వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యం ఖర్చుల కోసం భాస్కర్ ఆరు నెలల క్రితం  దుబాయి వెళ్లాడు. అయితే.. పరిస్థితి విషమించడంతో సాహిత్య శుక్రవారం ప్రాణాలు వదిలింది.
 


ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నారు.. అల్లారు ముద్దుగా కోరింది క్షణంలో తెచ్చిపెట్టేవారు. కానీ.. అనుకోని విధంగా ఆ చిన్నారిని మృత్యువు కబళించింది. అతి చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. అంత ప్రాణంగా పెంచుకున్న కూతురిని కనీసం కడసారి చూసుకోవడానికి కూడా ఆ తండ్రికి అవకాశం దక్కలేదు. వీడియో కాల్ లో నే అంత్యక్రియలు చూడాల్సి వచ్చింది. ఈ విషాదకర సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది.

Also Read నేను సింగిల్.. హగ్ ఇస్తారా అంటూ.....

Latest Videos

పూర్తి వివరాల్లోకి వెళితే...  జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరుకి చెందిన పాలాజీ భాస్కర్, సునీతలకు సాహిత్య(11) అనే కుమార్తె ఉంది. సాహిత్య గత కొన్ని రోజులుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతోంది.

బిడ్డ ప్రాణాలు కాపాడాలని అప్పు చేసి మరీ వైద్యం చేయిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యం ఖర్చుల కోసం భాస్కర్ ఆరు నెలల క్రితం  దుబాయి వెళ్లాడు. అయితే.. పరిస్థితి విషమించడంతో సాహిత్య శుక్రవారం ప్రాణాలు వదిలింది.

కూతురిని చివరసారి చూసుకోవడానికి దుబాయి నుంచి జగిత్యాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా అన్నీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో.. కూతురి అంత్యక్రియలు వీడియో కాల్ లో చూడటం గమనార్హం. కనీసం సునీత దగ్గర అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోతే స్థానికులే సహాయం చేయడం గమనార్హం.

click me!