కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఓ వ్యక్తి మద్యం దొరకక మితిస్తిమితం కోల్పోయి హైదరాబాదులో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో వ్యక్తి ఫ్లై ఓవర్ల మధ్య దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
హైదరాబాద్: కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం లభించడం లేదని మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పై నుంచి దూకి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు.
బంజారాహిల్స్ లోని ఇందిరానగర్ లో నివాసం ఉిండే మధు (55) సినీ పరిశ్రమలో పెయింటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ప్రతి రోజు మద్యం సేవించే అలవాటు ఉంది. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో కొన్నాళ్లుగా మద్యం దుకాణాలను మూసేశారు. దాంతో అతనికి మద్యం లభించలేదు.
undefined
Also Read: లాక్‌డౌన్ కష్టాలు: అన్నా.. ఇంట్లో పెళ్లాంతో చస్తున్నానంటూ ట్వీట్, కేటీఆర్ రిప్లై అదుర్స్
గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మధు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఐఎఎస్, ఐపిఎస్ క్వార్టర్స్ లోని బ్లాక్ 8 భవనం నాలుగో అంతస్థుకు వెళ్లాడు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్ లో ఉన్నవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు.
అదే రోజు తండ్రి కనిపించడం లేదని మధు కుమారుడు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వచ్చాడు. అతను తన తండ్రిని గుర్తించాడు.
ఫ్లై ఓవర్ నుంచి దూకి....
ఇదిలావుంటే, మరో ఘటనలో పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట బ్రాహ్మణవాడకు చెందిన టైల్స్ పని కార్మికుడు సాయి కూమార్ (32) కొద్ది రోజులుగా మద్యం లభించకపోవడంతో శుక్రవారం పంజగుట్ట చౌరస్తాలోని రెండు ఫ్లై ఓవర్స్ మధ్య దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని కాలు విరిగింది.