లాక్ డౌన్ నేపథ్యంలో అధిక ధరలకు కూరగాయలు అమ్మేవారిపై కొరడా ఝళిపించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడింది. కూరగాయల ధరలను నిర్ణయించి, ప్రకటించింది. అధిక ధరలకు అమ్మితే కాల్ చేయాల్సిన నెంబర్ కూడా ఇచ్చింది.
హైదరాబాద్: కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అధిక ధరలకు కూరగాయలు అమ్ముతూ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారి ఆగడాలను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. కూరగాయల ధరలను ప్రకటించింది. ఆ ధరలను మించి ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. అధిక దరలు అమ్మినవారి గురించి 1902 నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది. ఆ నెంబర్ కు కాల్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన కూరగాయల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. పప్పు ధాన్యాల ధరలను కూడా నిర్ణయించి ప్రకటించింది. పప్పు ధాన్యాల ధరలనే కాకుండా జొన్నలు, సజ్జలు, రాగులు వంటి ధాన్యాల ధరలను కూడా ప్రకటించింది.
కూరగాయలు…
వంకాయ- రూ.30 కేజీ
బెండకాయ- రూ.40 కేజీ
టమాట- రూ.10 కేజీ
అరటికాయ- రూ.40 కేజీ
కాలిఫ్లవర్- రూ.40 కేజీ
క్యాబేజి- రూ.23 కేజీ
పచ్చిమిర్చి- రూ.60 కేజీ
చిక్కుడుకాయ- రూ.45 కేజీ
బీరకాయ- రూ.60 కేజీ
క్యారెట్- రూ.60 కేజీ
ఆలుగడ్డ- రూ.30 కేజీ
ఉల్లిపాయలు(తెల్లవి)- రూ.30 కేజీ
ఉల్లి(ఎర్రవి)- రూ.35 కేజీ
వెల్లుల్లి- రూ.160 కేజీ
అల్లం- రూ.220 కేజీ
ఆకు కూరల రేట్లు ఇలా ఉన్నాయి..
ఆకు కూరలు
పాలకూర- కిలో రూ.40
తోటకూర- కిలో రూ.40
కొత్తిమీర- కిలో రూ.60
మెంతికూర- కిలో రూ.60
నిత్యావసర వస్తువుల రేట్లు..
పప్పు, ఇతర ధాన్యాల ధరలు
కందిపప్పు(గ్రేడ్1)- కిలో రూ.95
మినపపప్పు- కిలో రూ.140
పెసరపప్పు- కిలో రూ.105
శెనగపప్పు- కిలో రూ.65
సజ్జలు- కిలో రూ.30
గోధుమలు- కిలో రూ.36,
జొన్నలు- కిలో రూ.38
రాగులు- కిలో రూ.40