మహిళకు పురుటి నొప్పులు: ఆస్పత్రికి తరలించిన పోలీసులు

By telugu team  |  First Published Apr 8, 2020, 5:29 PM IST

కరీంనగర్ లో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గస్తీ వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ లో కఠినంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.


కరీంనగగర్:  తాము శాంతిభద్రతల పరిరక్షణ విధులకు మాత్రమే పరిమితంకాదు. పరిస్థితుల తీవ్రతను బట్టి మానవతాహృదయంతో స్పందించి సేవలందిస్తున్నామంటూ మరోసారి చాటి చెప్పారు. కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను పెట్రోలింగ్ వాహనంలో బుధవారం ఆసుపత్రికి  తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ... లాక్ డౌన్ లో భాగంగా కరీంనగర్ లోని అజ్మత్ పురా ప్రాంతంలో బందోబస్తు విధులను నిర్వహిస్తున్న కమీషనరేట్ విఆర్లో ఉన్న ఎస్ఐ కరుణాకర్ రావు, సిబ్బంది పురిటినొప్పులతో బాధపడుతున్నదనే సమాచారాన్ని అందుకుని, సత్వరం స్పందించి తమ పెట్రోలింగ్ వాహనంలో సదరు గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. 

Latest Videos

undefined

గర్భిణిని ఆసుపత్రకి తరలించిన ఎస్ఐ కరుణాకర్ రావు, కానిస్టేబుల్ ప్రశాంత్, హెూంగార్జులు సత్తయ్యఖలీలను పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందించడంతో పాటు వారికి రివార్డులను ప్రకటించారు.

కరీంనగర్ లో కరోనా వైరస్ గుబులు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలులో కరీంనగర్ వచ్చినవారి వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తూ వెళ్లింది. ఈ స్థితిలో కరీంనగర్ లో పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 

click me!