హైదరాబాదులో రెడ్ జోన్లు లేవు: కమిషనర్ అంజనీ కుమార్

By telugu teamFirst Published Mar 28, 2020, 9:08 AM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాదులో ఐదు రెడ్ జోన్లను ప్రకటించినట్లు వచ్చిన వార్తలను పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఖండించారు. హైదరాబాదులో ఏ విధమైన రెడ్ జోన్లు లేవని స్పష్టం చేశారు.

హైదరాబాద్: హైదరాబాదులో ఏ విధమైన రెడ్ జోన్లు లేవని హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ చెప్పారు. హైదరాబాదులో రెడ్ జోన్లను ప్రకటించినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాదులో ఐదు ప్రాంతాలను రెడ్ జోన్లుగా అధికారులు ప్రకటించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఈ విధంగా వార్తలు వచ్చాయి... తొలిసారి రెడ్ జోన్లను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కోకాపేట, కోత్తపేట, చందానగర్, గచ్చిబౌలి, తుర్క యంజాల్ ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. 14 రోజుల పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇళ్లకే రేషన్, నిత్యావసర సరుకులు అందించనున్నారు. 

Also Read: కరోనా లాక్ డౌన్: మద్యం దొరకడం లేదని భవనం నుంచి దూకి ఆత్మహత్య

ప్రజలు ఇళ్లకే ప్రజలు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. 14 రోజుల పాటు కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ఈ ప్రాంతాలకు రాకూడదు. ఈ ప్రాంతాలకు చెందినవారు ఇళ్లలోంచి బయటకు రావద్దు.

వంటగ్యాస్ సిలిండర్లకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. దీంతో బుక్ చేసిన 15 రోజులకు గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

శుక్రవారం ఒక్క రోజే పది కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి పెరిగాయి. ప్రతి రోజూ కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేస్తూనే ఉన్నారు 

click me!