కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వారిపై హైద్రాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై 25 వేల కేసులు నమోదు చేశారు. వాహనాలను కూడ సీజ్ చేశారు.
హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వారిపై హైద్రాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిపై 25 వేల కేసులు నమోదు చేశారు. వాహనాలను కూడ సీజ్ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హైద్రాబాద్ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఎవరైనా వాహనదారుడు తమ నివాసం నుండి మూడు కిలోమీటర్ల దూరం దాటితే ఆటోమెటిక్ గా ఆయా వాహనదారుడికి జరిమానాను విధిస్తున్నారు. నేరుగా ఆయా వాహన యజమానికి నోటీసులు పంపుతున్నారు.
నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం తమ నివాసం నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని దుకాణాల వద్దకు మాత్రమే వెళ్లాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. నిత్యావసర సరుకుల కొనుగోలుతో పాటు అత్యవసర వైద్య సేవల పేరు చెప్పి రోడ్లపైకి యధేచ్చగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య పెరిగింది.
పాత ప్రిస్కిప్షన్ స్లిప్ చూపి రోడ్లపై వాహనాలపై తీరుగుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో హైద్రాబాద్ లో మూడు కిలోమీటర్ల నిబంధనను అమల్లోకి తెచ్చారు పోలీసులు.
also read:కరోనా దెబ్బ: మీ వాహనం మూడు కి.మీ. దాటితే ఫైన్, డీజీపీ వార్నింగ్
ఇప్పటివరకు మూడు కిలోమీటర్ల దూరం అనే నిబంధనను పాటించని 25 వేల కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలను కూడ పోలీసులు సీజ్ చేశారు పోలీసులు. లాక్ డౌన్ తర్వాత ఈ వాహనాలను ఇవ్వనున్నారు.