కరోనా ఎఫెక్ట్: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను మూసివేయాలని మంత్రికి వినతి

By narsimha lode  |  First Published Apr 1, 2020, 2:45 PM IST

 హైద్రాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు, కమీషన్ ఏజంట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు వారంతా బుధవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.


హైదరాబాద్: హైద్రాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు, కమీషన్ ఏజంట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు వారంతా బుధవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కు అత్యధికంగా మహారాష్ట్ర నుండి బత్తాయి, ద్రాక్షతో పాటు ఇతర పండ్లు ప్రతి రోజూ వస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గడ్డి అన్నారం మార్కెట్ లో వ్యాపారులు, వర్తకులు, రైతులు, హామాలీలు ఆందోళన చెందుతున్నారు.

Latest Videos

also read:తెలంగాణ నుండి ఢిల్లీ ప్రార్థనలకు 1030 మంది: జిల్లాలవారీగా వివరాలు ఇవి

లాక్‌డౌన్ లో భాగంగా ఈ పండ్ల మార్కెట్ ను కూడ మూసివేయాలని  వారు ఈ వినతి పత్రంలో మంత్రిని కోరారు. దేశంలోని మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

మార్కెట్ కు వచ్చిన వారిలో ఎక్కువ మంది సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని కూడ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మార్కెట్ ను మూసివేయాలని మంత్రిని కోరారు. ఈ విషయమై  ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

మహారాష్ట్రలో ఇప్పటి వరకు సుమారు 320 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.ఈ వ్యాధి కారణంగా సుమారు 12 మంది మృతి చెందినట్టుగా కూడ ప్రభుత్వం ప్రకటించింది.ఇక తెలంగాణ రాష్ట్రంలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే సుమారు ఆరుగురు మృతి చెందారు.

.

 

click me!