లాక్ డౌన్ లో కేరింతలు.. హైదరాబాద్ లో చిన్నారుల రికార్డ్

By telugu news teamFirst Published Apr 7, 2020, 1:29 PM IST
Highlights

ఈ లాక్ డౌన్ వేళ 898 మంది చిన్నారులు జన్మించారు. అది కూడా కేవలం హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం విశేషం. మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రకటించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 898మంది చిన్నారులు జన్మించారు.

కరోనా మహమ్మారిని రికార్డును అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఇంకా వారం రోజులు మిగిలే ఉంది. ఇంకా కొనసాగించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

చాలా మందికి కనీసం తిండి కూడా దొరకడం లేదు. పలువురు తమ స్వస్థలాకు వెళ్లలేక పరాయి రాష్ట్రాల్లో ఇరుక్కొని అవస్థలు పడుతున్నారు. ఇంతటి కష్టకాలంలోనూ ఓ సంతోషకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆ సంతోషానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారడం గమనార్హం.

Also Read కరోనా లాక్‌డౌన్: డయల్ 100 కి 12 లక్షల ఫోన్లు, అనవసరమైనవే ఎక్కువ...

ఇంతకీ మ్యాటరేంటంటే... ఈ లాక్ డౌన్ వేళ 898 మంది చిన్నారులు జన్మించారు. అది కూడా కేవలం హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం విశేషం. మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ ప్రకటించగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 898మంది చిన్నారులు జన్మించారు.

వారంతా హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కోఠి మెటర్నరీ హాస్పిటల్, ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టారని జిల్లా అధికారులు చెప్పారు. ఈ లాక్ డౌన్ ముగియడానికి మరో వారం రోజులు గడువు ఉండగా.. ఆ కాలంలో మరో 1,257మంది జన్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు జన్మించిన 898 జననాలలో 534మంది నార్మల్ డెలివరీ ద్వారా జన్మించగా.. మిగలిన 363మంది సీ సెక్షన్ ద్వారా జన్మించారని అధికారులు చెబుతున్నారు.

అయితే.. చాలా మంది లాక్ డౌన్ కారణంగా సమయానికి ఆస్పత్రులకు చేరలేకపోతున్నామని సదరు మహిళలు, వారి కుటుంబసభ్యులు చెబుతుండటం గమనార్హం. కనీసం అంబులెన్స్ కి ఫోన్ చేసినా రావడం లేదని చాలా మంది చెప్పడం శోచనీయం.

‘ నేను మల్కాజిగిరీ చేరుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. మాకు కరోనా వైరస్  భయం ఉంది. కానీ.. పురిటి నొప్పులు ఆపలేం కదా. హాస్పిటల్ బయటే పడుకున్నాం.’ అంటూ ఓ మహిళ తాను పడిన బాధను వివరించింది. ఇలాంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కోనడం గమనార్హం.

click me!