ఢిల్లీ నుండి నేరుగా హైద్రాబాద్‌కు: ఆరుగురు మలేషియన్ల అరెస్ట్

By narsimha lode  |  First Published Apr 7, 2020, 10:34 AM IST

 ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కు హాజరై హైద్రాబాద్ లో తలదాచుకొంటున్న ఆరుగురు మలేషియన్లపై హైద్రాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఆరుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


హైదరాబాద్: ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగీ జమాత్ కు హాజరై హైద్రాబాద్ లో తలదాచుకొంటున్న ఆరుగురు మలేషియన్లపై హైద్రాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఆరుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధనల్లో పాల్గొని నేరుగా హైద్రాబాద్ కు వచ్చారు ఆరుగురు మలేషియన్లు. టోలిచౌకి సమీపంలోని హకీంపేట మజీదు వద్ద మలేషియాకు చెందిన హమీద్‌బిన్ జెహెచ్ గుజిలి, జెహ్రతులామని గుజాలి, వారామద్ అల్ బక్రివాంగ్, ఏబీడి మన్నన్ జమాన్ బింతి అహ్మద్, ఖైరిలి అన్వర్ బాన్ అబ్దుల్ రహీం, జైనారియాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Videos

ఈ ఆరుగురు టూరిస్టు వీసాలపై ఇండియాకు వచ్చారు. ఢిల్లీలోని జరిగిన జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత మలేషియాకు వెళ్లేందుకు  ప్రయత్నించారు.  అయితే అప్పటికే దేశంలో లాక్ డౌన్ అమలు చేశారు.  దీంతో వీరు మలేషియా వెళ్లేందుకు అవకాశం చిక్కలేదు.

ఈ ఆరుగురు ఢిల్లీ నుండి నేరుగా హైద్రాబాద్ హకీంపేటకు వచ్చారు. ఇక్కడే ఓ ప్రార్ధన మందిరంలో షెల్టర్ తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడి ప్రార్ధన మందిరంలో తలదాచుకొన్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. ఈ ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వస్తే స్థానికంగా ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వాలి. వారి ఆరోగ్య పరిస్థితులపై పరీక్షలు నిర్వహించాలి. 

also read:సామాన్యుడికో న్యాయం.. అసదుద్దీన్ కి ఇంకో న్యాయమా.?

అంతేకాదు వారిని క్వారంటైన్ చేయాలని నిబంధనలు ఉన్నాయి.ఈ నిబంధనలను తుంగలో తొక్కారు.దీంతో ఈ ఆరుగురిపై పోలీసులు కేసులు పెట్టారు.ఈ ఆరుగురికి ప్రభుత్వానికి తెలియకుండా ఆశ్రయం కల్పించిన స్థానికుడిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. మలేషియన్లను గాంధీ ఆసుపత్రి క్వారంటైన్ కు తరలించారు.
 

click me!